ఇదేం కక్కుర్తి.. డైరెక్టర్ హీరోయిన్‌ని ఎలా ముద్దు పెట్టుకున్నాడో చూడండి..!

ప్రముఖ దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ‘తిరగబడర స్వామి’ అనే సినిమాలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ హీరోగా నటించాడు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా బ్యానర్ పై మల్కాపురం శివకుమార్ ఈ సినిమా నిర్వహణ బాధ్యతలు చేపట్టారు. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మాల్వి మల్హోత్రా, మన్నారా చోప్రా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక టీజర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం.

టీజర్ రిలీజ్ ఈవెంట్లో ‘తిరగబడరా స్వామి’ సినిమా దర్శకుడు ఎ ఎస్ రవికుమార్ చౌదరి, హీరోయిన్ మన్నారా చోప్రా భుజంపై చేయి వేసి దగ్గరకు లాక్కుని మరి అందరిముందు ముద్దు పెట్టాడు. అతను అలా ముద్దు పెడుతుంటే మన్నారా చోప్రా కూడా ఏమీ అనుకుండ కూల్ గా స్మైల్ ఇచ్చింది. ఈ సంఘటన వల్ల మన్నారా చోప్రా ఫీల్ అవ్వకపోయినప్పటికీ ఆడియన్స్ మాత్రం బాగా హర్ట్ అయ్యారు. డైరెక్టర్ గురించి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దర్శకుడు హీరోయిన్ కి ముద్దు పెట్టిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఎ. ఎస్ రవికుమార్ గతంలో బాలకృష్ణ ని హీరోగా తీసుకొని ‘ విరభద్రం ‘అనే సినిమా ని చిత్రికరించారు. ప్రస్తుతం రాజ్ తరుణ్ ని హీరోగా తీసుకొని డైరెక్ట్ చేసిన ‘తిరగబడరా స్వామి’ సినిమా లో హీరోయిన్ ను బాలయ్య కు ఫ్యాన్ గా చూపించాడు. రవి కుమార్ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమా లను డైరెక్ట్ చేసాడు. యజ్ఞం, పిల్ల నువ్వు లేని జీవితం, సౌఖ్యం లాంటి సినిమా లకు దర్శకత్వం వహించాడు. ఇక తిరగబడర స్వామి సినిమా లో మకరంద్ దేశ్ పాండే, రఘు బాబు, జాన్ విజయ్,పృద్వి, ప్రగతి,బిత్తిరి సత్తి లాంటి వారు కీలక పాత్రలో నటిస్తున్నారు.