మెగా ఫ్యామిలీ పరిస్థితి ఇలా కావడానికి కారణం..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఈ మధ్యకాలంలో మెగా హీరోలు నటించిన సినిమాలన్నీ కూడా ఫ్లాపులుగా మిగులుతున్నాయి.. పవన్ కళ్యాణ్ ,సాయి ధరంతేజ్ నటించిన బ్రో సినిమా జులై 28న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.. దాదాపుగా రూ .30 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. ఆ తర్వాత రెండు వారాలకే చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా నెగిటివ్ టాక్ తో దాదాపుగా బయ్యర్లకు రూ .50 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చినట్టు సమాచారం.

ఈ సినిమా వచ్చిన రెండు వారాలకే ఆగస్టు 25న మెగా హీరో నాగబాబు కురుమారుడు వరుణ్ తేజ్ నటించిన గాండీవధారి అర్జున సినిమా విడుదల కాగా ఈ సినిమా మొదటి షో నుంచి నెగటివ్ టాక్ మూట కట్టుకుంది. డైరెక్టర్ ప్రవీణ్ సతార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మార్కెట్ను మించి బడ్జెట్ తో రూపొందించారు. ఈ సినిమా కూడా ఎంతో కాన్ఫిడెంట్గా విడుదల చేయగా నిరాశను మిగిల్చింది. గతంలో నటించిన గని సినిమా కూడా ఫ్లాప్ గా మిగిలింది.

మెగా హీరోల సినిమాలు ఫ్లాపులు కావడానికి ముఖ్య కారణం సరైన కథలను ఎంచుకోకపోవడమే కాకుండా సినిమా బడ్జెట్ తగ్గ బిజినెస్ కూడా జరగలేదు.. కేవలం వీరి యొక్క రెమ్యూనరేషన్ తోనే చాలా పాపులర్ అవుతున్నారు తప్ప సినిమాలు కొన్న బయ్యర్లకు నష్టాలని మిగులుస్తున్నారు. కేవలం రాజకీయాలు డైలాగులతో ఉండడమే కాకుండా కేవలం మెగా హీరోలను పైలెట్ చేస్తూ ఉండే డైలాగులు ఉండడంతో కథను పట్టించుకోకుండా సినిమాలను తెరకెక్కిస్తూ ఉండడంతో వీరీ సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని పలువురు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు. అది కూడా నెలలోపే మూడు ఘోరమైన పరాజయాలు చూశారు మెగా కుటుంబం.మరి రాబోయే రోజుల్లో నైనా ఇలాంటి పరిస్థితి నెలకొనుకోకుండా చూస్తారేమో చూడాలి మరి.