లేడీ కమెడియన్ కల్పన రాయ్ ఎలా మరణించిందో తెలిస్తే కన్నీళ్లగవు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది కమెడియన్లు ఉన్నప్పటికీ లేడీ కమెడియన్ గా మాత్రమే కొంతమంది మాత్రమే సక్సెస్ అయ్యారు.. అలాంటి కోవకే చెందిన నటి కల్పనా రాయ్.. ఈమె నటనతో ఎంతోమందికి గుర్తుండిపోయే ఇలా నటించింది.. ఈమె ఏ సినిమాలో కూడా పూర్తిస్థాయిలో రోల్ చేయలేదు.. కేవలం చిన్న చిన్న పాత్రలలోని నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలా చిన్న చిన్న పాత్రలలోని దాదాపుగా 400కు పైగా సినిమాలలో నటించింది కల్పనా రాయ్..

Kalpana Rai Wiki Bio Age Husband Salary Photos Videos Ig Fb Tw

ఈమె నటించిన ప్రతి సినిమా కూడా తన నటనకి మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.. ముఖ్యంగా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో డిఫరెంట్ కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటుంది.. మొదట ఓ సీత కథ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన కల్పనా రాయ్ ఆ తర్వాత ఇవివి సత్యనారాయణ తెరకెక్కించిన జంబలకడిపంబ అనే సినిమా ద్వారా మంచి గుర్తింపును అందుకున్నది.. ఇందులో ఈమె చేసింది చిన్న పాత్ర అయినప్పటికీ ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయేలా చేసింది

అలాంటి కల్పనా రాయ్ 2008వ సంవత్సరంలో హైదరాబాదులో ఇందిరానగర్ లో మృతి చెందింది..ఈమె కంటూ ఒక సొంత కుటుంబం కూడా లేదు అందుకే తన సంపాదించింది తక్కువే అయినా ఉన్నంతలోనే ఎక్కువగా సహాయం చేస్తూ ఉండేదట.. కాని చివరి రోజుల్లో ఈమె డబ్బులు అవసరమైనప్పుడు ఎవరు కూడా సహాయం చేయలేదట. దీంతో తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ చికిత్సకు కూడా డబ్బులు లేక మరణించిందట కల్పనా రాయ్.. చివరికి ఈమె అంత్యక్రియలకు కూడా డబ్బులు లేవు అంత దయనీయ పరిస్థితిలో ఉండేదట.. అలాంటి పరిస్థితుల్లో మా మూవీ అసోసియేషన్ ముందుకు వచ్చి ఈమె అంతక్రియలను 10 వేల రూపాయల ఖర్చుతో చేసినట్టు సమాచారం. అన్ని సినిమాలలో నటించి అంత సంపాదించిన చివరికి ఏమీ లేకుండా పోవడంతో అభిమానులు బాధపడుతున్నారు.