ఆ విషయంలో సంయుక్త మీనన్ డిమాండ్ మామూలుగా లేదుగా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మలయాళం హీరోయిన్స్ కి ఈమధ్య మంచి డిమాండ్ ఉందని చెప్పవచ్చు..అలా మొదట చిన్న పాత్రలో కనిపించి మంచి విజయాన్ని అందుకుంది హీరోయిన్ సంయుక్త మీనన్.. భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది కాసేపు అయిన ఈ అమ్మడు బాగానే ఆకట్టుకోవడంతో ఆ తర్వాత బింబిసార, సార్, విరూపాక్ష వంటి చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. దీంతో అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో టాప్ లో దూసుకుపోతోంది సంయుక్త మీనన్..

16 Samyuktha Menon Hot & Sexy Photos | SIR Movie Heroine - Just for Movie  Freaks

అయితే సినిమాల ఎంపిక విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం తను కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాలో నటిస్తోంది.. అలాగే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ తో కూడా ఒక పాన్ ఇండియా చిత్రం లో హీరోయిన్గా ఎంపికైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ భారతి కృష్ణమాచార్య దర్శకత్వం వహించగా.. ఈ సినిమా పేరు స్వయంభు.. అయితే ఈ చిత్రంలో నటించేందుకు సంయుక్త భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి..

ప్రస్తుతం వరుసహిట్లతో ఉన్న సంయుక్త అడిగినంత ఇచ్చి సినిమాలోకి తీసుకుంటున్నట్లు సమాచారం.. బింబి సార, సార్ , విరూపాక్ష సినిమాలకు కోటి లోపల రెమ్యూనరేషన్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఒకేసారి ఇప్పుడు స్వయంభూ సినిమా కోసం రూ.1.5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు పొందిన ఈ ముద్దుగుమ్మ పారితోషకం ఇంత అడగడంలో తప్పేం లేదంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. మరి పాన్ ఇండియా రేంజిలో పలు సినిమాలో నటిస్తున్న సంయుక్తాకు ఎలాంటి క్రేజ్ వస్తుందో చూడాలి మరి.