రాజకీయాలపై మరొకసారి షాకింగ్ కామెంట్స్ చేసిన నటుడు శరత్ కుమార్..!!

కోలీవుడ్ టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు శరత్ కుమార్ అంటే ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు హీరోయిన్ రాధిక భర్తగా ప్రతి ఒక్కరికి సుపరిచితమే ఎన్నో సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించి మంచి పాపులారిటీ అందుకున్నారు.. కోలీవుడ్ నటుడు డైరెక్టర్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం తమిళకుడిమగన్ ఈ సినిమా ఆడియో ట్రైలర్ ని ఆవిష్కరించేందుకు నిన్నటి రోజున ఉదయం సినీ నటుడు శరత్ కుమార్ ముఖ్యఅతిథిగా అక్కడికి విచ్చేసినట్టు తెలుస్తోంది..

ఈ సందర్భంగా అక్కడ నిర్మాత ఇస్సకి కార్వానన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రాలలో బగ్గు మంటున్న కులచిచ్చు ఇతివృత్తంతో ఈ సినిమాని తెరకెక్కించినట్లు తెలిపారు.. అయితే ఇది సినిమా లాంటిది కాదు ఒక పాఠం వంటిది పుట్టుకతో అందరూ సమానమే ఎదిగిన తర్వాతే కుల అసమతాలు ఏర్పడ్డాయి ఈ సినిమాలో కులవృత్తుల గురించి ప్రస్తావించామని తెలిపారు.. నటుడు శరత్ కుమార్ మాట్లాడుతూ.. కుల విభేదాలకు కారణం రాజకీయాలైనా అంటూ తెలియజేయడం జరిగింది… మనిషి పుట్టినప్పుడు కులం ఏంటన్నది తెలియదు కానీ పాఠశాలలో కాలేజీలో అందరూ కలిసిమెలిసి ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటారు..

కానీ రాజకీయాలలో ప్రవేశించిన తర్వాతే కుల మతా బేధాలు ఏర్పడుతున్నాయని కులవివక్షతను రూపొందించడానికి వేరే రాజకీయం ఉన్నది.. అది సమానత్వం దానికోసం అందరూ పాటుపడాలి నేను రాజకీయ నాయకుడిని సమానత్వం కోసమే తన భవిష్యత్తు కార్యక్రమాలు కూడా చేపడుతూ ఉంటారని తెలియజేశారు.. తమిళకుడిమగన్ సినిమా నిజాన్ని చెప్పే సినిమా అని కులవృత్తి గురించి ఈ సినిమా మాట్లాడుతుంది అని తన అభిప్రాయంగా తెలిపారు. ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లుగా కూడా తెలియజేశారు శరత్ కుమార్.