రీ రిలీజ్ కి సిద్ధమైన రామ్ చరణ్ బ్లాక్ బాస్టర్ మూవీ.. ఎప్పుడంటే..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో రి రిలీజ్ ట్రెండ్ ఎక్కువగా కొనసాగుతోంది.. కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటోంది. హిట్..ఫ్లాప్ సంబంధం లేకుండా మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చి ఆ చిత్రాలను అభిమానులు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.. కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలే కాకుండా తమిళ స్టార్ హీరోల చిత్రాలు కూడా రీ రిలీజ్ చేస్తూ అదిరిపోయేలా కలెక్షన్స్ అందిస్తూ ఉన్నారు తెలుగు ప్రేక్షకులు.. అందుకే పలువురు డిస్ట్రిబ్యూటర్లు సైతం మరికొన్ని సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Prime Video: Naayak

ఈ క్రమంలోనే రాంచరణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం నాయక్ చిత్రాన్ని మళ్లీ థియేటర్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.. ఈనెల 22వ తేదీన చిరంజీవి పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే నాయక్ సినిమాని ఆ రోజున రీ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించారు.. దీంతో మెగా అభిమానులు మరొకసారి చరణ్ డ్యూయల్ రోల్ లో నటించిన ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రం చూసేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమాని వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కించారు.


2013లో ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. ఇందులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అమలాపాల్ కూడా నటించారు. సంగీతాన్ని థమన్ అందించగా ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ కోసం చార్మిని కూడా ఎంపిక చేయడం జరిగింది. అప్పట్లో ఈ పాట సంచలనంగా మారింది. రామ్ చరణ్ కెరియర్ లోనే యాక్షన్ సీన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుందని చెప్పవచ్చు.. మరి కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.