గల్లా-కేశినేని టీడీపీకి ఝలక్..తేల్చేసుకున్నారా?

తెలుగుదేశం పార్టీలో ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వ్యవహార శైలి కాస్త వేరుగా ఉంది..వారు అసలు పార్టీతో కలవడం లేదు. సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ఇద్దరు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవల లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరు, విజయవాడ పరిధిలో జరిగింది..అయినా సరే గుంటూరు ఎంపీగా గల్లా, విజయవాడ ఎంపీగా కేశినేని హాజరు కాలేదు. దీంతో వారిద్దరు రాకపోవడంపై చర్చ జరుగుతుంది.

ఆ ఇద్దరు పార్టీకి దూరంగా ఉండటం తో పాదయాత్రలో పాల్గొనలేదా? ఇంకా వారు టి‌డి‌పికి దూరం అవ్వడానికి సిద్ధమయ్యారా? అనే ప్రశ్నలు వస్తున్నాయి. అయితే గల్లా తన వ్యాపారాలతో బిజీగా ఉన్నారు..తాజాగా యువగళం పాదయాత్ర విఫలమైందని గల్లా అన్నట్లు కథనాలు వచ్చాయి. దీనిపై వివరణ ఇస్తూ..ఇదంతా వైసీపీ చేస్తున్న ఫేక్ కథనాలు అని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఆయన కాస్త టి‌డి‌పి వైపే ఉన్నట్లు తెలుస్తోంది. ఇటు కేశినేని వ్యవహారం క్లారిటీ లేదు. ఇప్పటికే ఆయన సొంత పార్టీ నేతలపైనే విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

అటు వైసీపీ నేతలతో కలిసి పనిచేస్తున్నారు. లోకేష్ పాదయాత్రలో పాల్గొనలేదు. ఎందుకంటే కేశినేని సోదరుడు కేశినేని చిన్నికి యువగళం నిర్వహించే బాధ్యతలు అప్పగించారు. దీంతో నాని దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయన దూరమైపోతారా? వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ సీటు కేశినేని చిన్నికి ఇస్తారా? అనే డౌట్ కూడా ఉంది. అదే జరిగితే కేశినేని నాని టి‌డి‌పికి దూరం కావడం ఖాయం.

వైసీపీలోకి వెళ్ళిన ఆశ్చర్యం అవసరం లేదు..లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేసి టి‌డి‌పికి నష్టం చేయవచ్చు. చూడాలి మరి గల్లా, కేశినేని చివరికి ఏం చేస్తారో.