బేబీ హీరోయిన్ టెన్త్ క్లాస్ లోనే అలా చేసిందా.. అది చూసి ఏడ్చేసిన తల్లి..!

ఇటీవల ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా నటించిన బేబీ సినిమాతో మంచి పాపులారిటీ దక్కించుకుంది వైష్ణవి. ఈ సినిమాతో సూపర్ సక్సెస్ సాధించిన వైష్ణవికి ప్రస్తుతం వరుస ఆకాశాలు క్యూ కడుతున్నాయి. ఈ నేపద్యంలో తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొంది వైష్ణవి. ఆమె కెరీర్‌ర్ స్టార్టింగ్ నుంచి ఎదుర్కొన్న కష్టాలు బేబీ సినిమా హిట్ తర్వాత పొందుతున్న ప్రేమాభిమానాలను గురించి చెప్పుకొచ్చింది.

యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ చేసే టైంలో డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి సపరేట్ రూమ్స్ ఉండేవి కాదని బాత్రూంలోనే డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేదాన్ని బాత్రూంలో డ్రెస్ చేంజింగ్‌కి నా తిప్పలు చూడలేక అమ్మ కంటతడి పెట్టిందని చెప్పుకొచ్చింది. ఇక సినిమాలో ఛాన్స్ వచ్చిన తర్వాత స్టార్ వ్యానిటీ వ్యాన్‌లో 5నిమిషాలు వాష్ రూమ్ యూజ్‌ చేసుకుంటానని అడిగినప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

తన టెన్త్ క్లాస్ నుంచి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్‌ భుజాన వేసుకుని వైష్ణవి ఎన్నో బర్త్డే ఈవెంట్స్, ఫంక్షన్స్‌లో డ్యాన్స్ చేస్తూ రూ.700 సంపాదించేదట. అవి తీసుకువెళ్లి డైరెక్ట్ గా అమ్మకు ఇస్తే సరుకులు కొనేదని చెప్పుకొచ్చింది. ఇక ప్రస్తుతం ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనితో కలిసి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రూపొందుతున్న పాన్ ఇండియా లెవెల్ మూవీ డబ్బులు ఇస్మార్ట్‌లో హీరోయిన్‌గా వైష్ణవికి అవకాశం వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.