వరుణ్ కాబోయే భార్య పేరును మొబైల్లో ఏమని సేవ్ చేసుకున్నాడో తెలుసా..?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇటీవల స్టార్ హీరోయిన్ లావణ్య త్రిపాఠితో ఎంగేజ్మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం గాండీవ దారి అర్జున్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉన్నా వరుణ్ తేజ్ ఈ క్రమంలో బుల్లితెరపై ఓ ప్రోగ్రాంకు గెస్టుగా హాజరయ్యాడు. హీరోయిన్ సాక్షి వైద్య, యాంకర్ సుమతో కలిసి ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు.

ఇక ఈ షోలో కొంతమంది ఫ్యాన్స్ అడిగిన క్వశ్చన్స్ కు క్విక్ ఆన్సర్లు ఇచ్చాడు వరుణ్. ఇందులో భాగంగానే మీరు మీకు కాబోయే భార్య లావణ్య త్రిపాఠి పేరును మొబైల్లో ఏం సేవ్ చేసుకున్నారని అభిమాని ప్ర‌శ్నించగా LAVN అని సేవ్ చేశానని ఫోన్ తీసుకుని తనే స్వయంగా అలా సెట్ చేసిందని చెప్పుకొచ్చాడు. ఇక లావణ్య కు మీరు ఇచ్చిన ఫ‌స్ట్‌ గిఫ్ట్ ఏంటని వ‌రుణ్‌ని అభిమాని అడగగా చాలా ఏళ్లయింది కదా గుర్తులేదు.. అంటూ వివరించాడు.

ఇక తాజాగా వీరిద్దరు పెళ్లి డేట్ కూడా వచ్చే ఫిక్స్ అయిందంటు వార్త‌లు జోరుగా వినిపిస్తున్నాయి. ఇక ఈ జంట ఈ ఆగస్టు 25వ తేదీన ఇటలీలో గ్రాండ్ గా వెడ్డింగ్ డేస్టినేషన్ చేసుకోబోతున్నారట. అలాగే నవంబర్ 1వ‌ తేదీన వరుణ్ – లావణ్య త్రిపాఠిలు పెళ్లి చేసుకోబోతున్నారంటూ మెగా కాంపౌండ్ నుంచి న్యూస్ వైరల్ అవుతుంది.