జోరు చూపిస్తున్న `ఏజెంట్` బ్యూటీ.. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ మూవీలో ఛాన్స్‌!?

సాక్షి వైద్య.. ఈ బ్యూటీ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అఖిల్ అక్కినేని హీరోగా వ‌చ్చిన `ఏజెంట్` మూవీతో సాక్షి వైద్య హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ, ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఘోరంగా బోల్తా ప‌డింది. అయితే సాక్షి వైద్య అందానికి మాత్రం యూత్ ఫిదా అయ్యారు. ఈ అమ్మడు నుండి రాబోతున్న రెండో చిత్రం `గాండీవధారి అర్జున`. వ‌రుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తారు ఈ మూవీని తెర‌కెక్కించారు.

నాగబాబు సమర్పణలో శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై బి.వి.ఎస్‌.ప్ర‌సాద్ నిర్మించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ప్ర‌స్తుతం వ‌రుణ్ తో క‌లిసి సాక్షి ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ లో జోరుగా పాల్గొంటోంది. అయితే రెండో సినిమా విడుద‌ల‌కు ముందే సాక్షి వైద్య బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింది. ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీలో ఛాన్స్ ద‌క్కించుకుంది.

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో `ఉస్తాద్ భగత్ సింగ్` అనే మూవీ తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా న‌టిస్తోంది. అయితే సెకండ్ హీరోయిన్ రోల్ కోసం సాక్షి వైద్య‌ను ఎంపిక చేశారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యాన్ని ఆమె క‌న్ఫార్మ్ చేసేసింది. త్వ‌ర‌లోనే సాక్షి ఉత్తాద్ భ‌గ‌త్ సింగ్ షూటింగ్ లో జాయిన్ కాబోతోంది. అలాగే మెగా మేన‌ల్లుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ తో కూడా ఈ బ్యూటీ ఓ మూవీకి క‌మిట్ అయింది.