నటుడు రాజేంద్రప్రసాద్.. వి.కే. నరేష్ మధ్య గొడవలు రావడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది.. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉండే పలుకుబడితో కొంతమంది హీరోలకు వెళ్లిన సినిమాలు ఇతర హీరోలు తీసుకొని మరి సక్సెస్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. అలా ఒకప్పుడు బాలయ్య, చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున వంటి హీరోలు కూడా మాస్ క్లాస్ సినిమాలలో నటించారు.. అలాంటి సమయంలోనే నటుడు రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ ఇద్దరు కూడా కామెడీ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య గట్టి పోటీని ఉండేది అప్పట్లో..

ఇందులో భాగంగానే ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో జంబలకడిపంబ అనే సినిమాని రాజేంద్రప్రసాద్ చేయవలసి ఉండగా వీకే నరేష్ వాళ్ళ అమ్మ అయినా విజయనిర్మల ఆమెకు ఉన్న పలుకుబడితో ఈ సినిమాని నరేష్ కి వచ్చేలా చేసింది.. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నరేష్ కెరియర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఇండస్ట్రీలో ఇలాంటివి అన్ని కామన్ గా జరుగుతూనే ఉంటాయి.. అప్పటినుంచి రాజేంద్రప్రసాద్, నరేష్ మధ్య పలు విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. ప్రస్తుతం వీకే నరేష్, రాజేంద్రప్రసాద్ ఇద్దరూ కూడా పలు చిత్రాలలో సైడ్ క్యారెక్టర్లలో కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు.

అయితే ఈ మధ్యకాలంలో అలాంటివన్నీ ఏమీ లేకుండా కలిసిపోయి.. మరి పలు చిత్రాలలో నటించడమే కాకుండా ఏదైనా ఫంక్షన్ ఈవెంట్లలో కూడా కనిపిస్తూ ఉన్నారు. ఇక వీరికి నరేష్ ప్రస్తుతం పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తూ ఉన్నారు. వీరిద్దరూ కలిసి మళ్ళీ పెళ్లి అనే చిత్రంలో కూడా నటించారు.ఈ సినిమా పర్వాలేదు అనిపించుకుంది.. రాజేంద్రప్రసాద్ అడపా దడపా సినిమాలలో నటిస్తు బాగానే ఆకట్టుకుంటున్నారు.