పెళ్లి తరువాత బన్నీ, చరణ్ అలా మారిపోయారు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాంఢీవదారి అర్జున”పైన మంచి అంచనాలే వున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. ఇక్కడ వరుణ్ తేజ్ ను కూడా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలపై ప్రశ్నలు అడగడం జరిగింది.

ఆ ప్రశ్నల్లో భాగంగా పెళ్లి తరువాత రామ్ చరణ్, బన్నీలో ఎవరు బాగా మారిపోయారు? అని సుమ అడగగా… ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి సందేహించిన వరుణ్ ఆ ప్రశ్న వాళ్లనే అడిగితే బాగుంటుందని అన్నాడు. అయితే కొద్ది సేపటి తరువాత ఆ ప్రశ్నకు ఆన్సర్ చెప్పాడు. పెళ్లైతే ఎవరైనా మారిపోవాల్సిందే. పెళ్లాలు చెప్పింది నోరు మూసుకొని వినాల్సిందే అంటూ సమాధానం ఇచ్చాడు వరుణ్. ఈ సందర్భంగా ఎఫ్ 2 లో కూడా అనిల్ రావిపూడి తమకు అదే నేర్పించాడని తెలిపిన వరుణ్ నిజ జీవితంలో కూడా దానిని ఫాలో అయిపోవడం మంచిదని పేర్కొ్న్నాడు.

ఇకపోతే మెగా వారసుడు వరణ్ తేజ్ త్వరలో హీరోయిన్ లావణ్య త్రిపాఠిని ప్రేమ విహహం చేసుకోబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక వరుణ్ తేజ్ సమాధానం విన్నవారు లావణ్య త్రిపాఠి చాలా లక్కీ అంటూ కామెంట్ చేస్తున్నారు. పెళ్లికి ముందే వరణ్ తేజ్ భార్య మాట వినాలని డిసైడ్ అయిపోయాడని, అంతకంటే సేఫ్ జోన్ ఇంకా ఉండదంటూ కొంతమంది మగమహారాజులు కామెంట్ చేస్తున్నారు. ఈ విషయంలో లావణ్య చాలా అదృష్టవంతురాలు అని అంటున్నారు. ఇక సుమ మరో ఆసక్తికరమైన ప్రశ్న కూడా వరుణ్ ను అడిగింది. లావణ్య, నిహారిక నుంచి అర్జెంట్ గా కాల్ చేయి అని ఒకేసారి మెసేజ్ వస్తే మొదట మీరు ఎవరికి చేస్తారు అని ప్రశ్నించగా వరుణ్ ఏమాత్రం తడుముకోకుండా వెంటనే నిహారికకు కాల్ చేస్తాను తను చిన్న పిల్ల అని సమాధానం చెప్పాడు.