ఆ ఎమ్మెల్యేలని సొంత వాళ్లే ఓడిస్తారా?   

ఏపీలో అధికార వైసీపీకి అంత అనుకూల పరిస్తితులు కనిపించడం లేదు. ఆ పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఇప్పటికే ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఇక అటు టి‌డి‌పి,జనసేన బలపడటం వైసీపీకి మైనస్. ఇదే సమయంలో వైసీపీలో ఉండే అంతర్గత పోరు పెద్ద మైనస్ అవుతుంది. దీని వల్ల పార్టీకి డ్యామేజ్ జరిగేలా ఉంది. ఇప్పటికే పలు స్థానాల్లో ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే గళం విప్పుతున్నారు.

అసలు పార్టీ కోసం పనిచేసిన తమని పక్కన పెట్టి వలస వచ్చిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారనే అసంతృప్తి పార్టీ నేతల్లో ఉంది. దీంతో అలాంటి ఎమ్మెల్యేలని మార్చేయాలని ఒకవేళ మళ్ళీ వాళ్ళకు సీట్లు ఇస్తే తాము ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు. ఈ క్రమంలో పలు స్థానాల్లో జరుగుతున్న రచ్చ ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా రిజర్వడ్ స్థానాల్లో ఈ పంచాయితీ ఎక్కువ ఉంది. పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుపై సొంత వాళ్ళే యాంటీగా ఉన్నారు. ఇటు తిరువూరులో రక్షణనిధి పరిస్తితి అంతే. ఆయనకు మళ్ళీ సీటు ఇస్తే తామే ఓడిస్తామని అంటున్నారు.

ఇక సంతనూతలపాడులో అదే రచ్చ..అక్కడ ఎమ్మెల్యే సుధాకర్ బాబుకు వ్యతిరేకంగా వైసీపీలో ఉండే రెండు కీలక సామాజికవర్గాలు రెడ్డి, కమ్మ నేతలు ఉన్నారు. ఇప్పటికే రెడ్డి వర్గం ఎమ్మెల్యేకు యాంటీ ఉంది. కాకపోతే ఎమ్మెల్యే ఎలాగోలా సర్దిచెప్పుకున్నారు. కానీ కమ్మ వర్గం శాంతించడం లేదు. నియోజకవర్గంలో కమ్మ వర్గం ఓట్లే ఎక్కువ. దీంతో తమని పట్టించుకోవడం లేదని, నెక్స్ట్ ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామని అంటున్నారు.

అటు గూడూరులో ఎమ్మెల్యే వరప్రసాద్ పరిస్తితి మరీ ఘోరంగా ఉంది. ఆయనకు ఎట్టి పరిస్తితుల్లోనూ సీటు ఇవ్వవద్దని సొంత పార్టీ నేతలే అంటున్నారు. ముఖ్యంగా రెడ్డి వర్గం నేతలు..ఇలా పలు స్థానాల్లో రచ్చ ఉంది. సొంత వాళ్ళే వైసీపీ ఎమ్మెల్యేలని ఓడించేలా ఉన్నారు.