ఒంగోలులో చినబాబు హడావిడి బాలినేనితో సులువు కాదు.!

ఒంగోలు అసెంబ్లీ..బాలినేని శ్రీనివాస్ రెడ్డి కంచుకోట. ఈ కంచుకోటని కూల్చాలని టి‌డి‌పి తెగ ప్రయత్నిస్తుంది. 2014 మాదిరిగా 2024లో కూడా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఇప్పటికే టి‌డి‌పి ఇంచార్జ్ దామచర్ల జనార్ధన్..బాలినేనికి చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా పట్టు దొరకడం లేదు. బాలినేని ఆధిక్యానికి గండి కొట్ట లేకపోతున్నారు.

ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఒంగోలు వచ్చింది. అక్కడ భారీగానే టి‌డి‌పి శ్రేణులని పోగేసి పాదయాత్రని సక్సెస్ చేసుకున్నారు. సభకు పెద్ద ఎత్తున జనాలని తీసుకొచ్చారు. ఇక దీంతో బాలినేనికి చెక్ పడినట్లే అని టి‌డి‌పి నేతలు చెప్పుకుంటున్నారు. కానీ అక్కడ బాలినేనిని ఓడించడం అంత సులువు కాదనే చెప్పాలి. అసలు టి‌డి‌పి కంచుకోటగా ఉన్న ఒంగోలుని తన అడ్డాగా మార్చుకున్నారు. 1983, 1985, 1994 ఎన్నికల్లో టి‌డి‌పి హవా నడుస్తూ వచ్చింది. ఇక 1999లో రాష్ట్రంలో టి‌డి‌పి హవా ఉన్న..ఒంగోలులో బాలినేని కాంగ్రెస్ నుంచి సత్తా చాటారు. ఇక వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలిచారు.

2012 ఉపఎన్నికలో వైసీపీ నుంచి గెలిచారు. 2014లో మాత్రం ఓటమి పాలయ్యారు. మళ్ళీ తిరిగి పుంజుకుని 2019లో గెలిచారు. మంత్రిగా చేశారు. ఇలా ఒంగోలుపై బాలినేనికి పూర్తి పట్టుంది. దీంతో ఆయనని ఓడించడం అనేది ఈజీ కాదు. ఇప్పటికీ అక్కడ బాలినేని హవా తగ్గలేదు.

ఇటు టి‌డి‌పి నేత దామచర్ల బలం పూర్తిగా పెరగలేదు. లోకేష్ పాదయాత్ర ప్రభావం ఏదో ఒక్క రోజే ఉంటుంది. దీని వల్ల ఉపయోగం ఉండదు. కాబట్టి ఒంగోలు మళ్ళీ బాలినేనికే దక్కే ఛాన్స్ ఉంది.