అందువల్లే రష్మీ జబర్దస్త్ ను వీడి బయటికి రాలేకపోతోందా..!!

తెలుగు బుల్లితెరపై జబర్దస్త్ కార్యక్రమానికి ఎంత పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా తెలియజేయాల్సిన అవసరం లేదు..రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగి ఉన్నది ఈ షో.. జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ యాంకర్స్ మంచి పాపులారిటీ సంపాదించారు. ప్రస్తుతం ఇందులో కొంతమంది సినీ ఇండస్ట్రీలో సెటిల్ అవ్వగా మరి కొంతమంది పలు రకాల కామెడీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. అలా జబర్దస్త్ లోకి ఎంట్రి ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో రష్మీ కూడా ఒకరు.

Intro | Rashmi, Roja, Mano | Extra Jabardasth | 22nd October 2021 | ETV  Telugu - YouTube

జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో రష్మీ పలు చిత్రాలలో కూడా అవకాశాలను అందుకుంది. ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వాటిలో కూడా హోస్టుగా చేసింది.. అయితే రష్మీ జబర్దస్త్ లోకి యాంకర్ గా వచ్చే సమయంలో మల్లెమాలవారు కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగిందట. అందుకోసం ఒక అగ్రిమెంట్ మీద కూడా రష్మి సైన్ చేసినట్లు సమాచారం. ఆ అగ్రిమెంట్లో ఏముందంటే.. ఒకవేళ రష్మి ఈ షో ని వదిలేయాలి అంటే మూడు నెలల ముందే మల్లెమాల వాళ్లకు సమాచారం ఇవ్వాలట.

అలాగే ఆ మూడు నెలల జీతం కూడా రష్మీకి ఇవ్వరట షోలో ఎలా మాట్లాడాలో కూడా పూర్తిగా మల్లెమాల వారి రైట్స్ ఉంటాయట. వీటన్నిటిని ఒప్పుకుంటేనే అగ్రిమెంట్ పైన సైన్ చేయమని మల్లెమాల వారు చెబితే అన్నిటికీ కూడా రష్మీ ఓకే చెప్పి వాటి మీద సైన్ చేసినట్లు బుల్లితెర వర్గాల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. అందుచేతనే రష్మీ జబర్దస్త్ ను వీడడం లేదంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.