సినిమాలు చెయ్యనంటు సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ హీరో..!!

టాలీవుడ్ లో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న నటులలో మాస్ మహారాజ్ రవితేజ కూడ ఒకరు.. ఈయన కూడా ఇండస్ట్రీలోకి ఎవరి అండా లేనిదే అడుగుపెట్టాడు. ఈ మధ్యనే వాల్తేరు వీరయ్య సినిమాలో చిరంజీవి తమ్ముడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరించాడు. అప్పట్లో రవితేజ చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన కెరీర్ ని ముందుకు కొనసాగించాడు. ఆ తరువాత ఒక్కొక్క అవకాశం తో తను ఎదుగుతూ ప్రేక్షకుల్లో క్రేజ్ ను ననుసంపాదించుకున్నాడు. కంటెంట్ లేని సినిమాను కూడా తన ఎనర్జీతో మంచి విజయాలను అందుకున్నారు.

Ravi Teja Biography: Movies, Photos, Videos, News, Biography & Birthday

రవితేజ క్యారెక్టర్ ఆర్టిస్టు నుంచి హీరో పొజిషన్కు వరకు నటించిన సినిమాలు 50 దాకా ఉన్నాయి. అప్పట్లో రవితేజ సినిమాలు కనీసం సంవత్సరానికి రెండు మూడు చొప్పున విడుదలయ్యేవి. అలాంటి హిట్ల మీద హిట్లు కొట్టిన హీరో సినిమాకి పుల్ స్టాప్ చెబుతున్నాడని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.

అలా ఎందుకు చేస్తున్నాడో రవితేజ అంటే రెండు మూడు సంవత్సరాలు మాత్రమే హీరోగా నటిస్తాడట. ఆ తరువాత డైరెక్టర్ గా పని చేయాలని ఆయన కోరికట. అందుకోసమే సినిమా డైరెక్టర్ చేయాలని హీరోగా పుల్ స్టాప్ పెట్టి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నాడు. గతంలో కూడా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడం జరిగింది రవితేజ.. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు గానీ ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మాత్రం చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంత ఎనర్జీటీ ఉందో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీటీతో సినిమాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించారు..కాబట్టి రవితేజ కూడా సినిమాల్లో హీరోగా నటిస్తూ ఉన్నప్పటికీ డైరెక్టర్ గా సక్సెస్ అవుతారేమో చూడాలి మరి.