కోమటిరెడ్డి జంపింగ్‌కు బ్రేక్? సర్దుకుంటారా?

తెలంగాణ బీజేపీలో మార్పులు వేగంగా జరిగిన విషయం తెలిసిందే. పార్టీ రోజురోజుకూ బలహీనపడుతున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడుని మార్చేశారు. బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డిని అధ్యక్షుడుగా నియమించారు. బండి దూకుడుగా పనిచేసిన ఆయన అందరినీ కలుపుకుని వెళ్ళడం లేదనే విమర్శలు ఎదురుకున్నారు. ఈ క్రమంలో బండిని తప్పించి కిషన్ రెడ్డిని పెట్టారు.

అయితే కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవి వదిలి…అధ్యక్షుడుగా చేయడం పెద్ద ఇష్టంగా లేనట్లు ఉంది. కానీ అధిష్టానం ఆదేశాలని పాటించాల్సిన పరిస్తితి. అదే సమయంలో బి‌జే‌పిని పలువురు సీనియర్లు వీడిపోతారని ప్రచారం వచ్చింది. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి…ఇంకా కొందరు నేతలు జంప్ అయ్యే ఛాన్స్ ఉందని కథనాలు వచ్చాయి. ఈ క్రమంలోనే వారి జంపింగుకు బ్రేక్ వేసేలా కీలక పదవులు ఇచ్చారు. ఈటలని ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఈటల ఇంకా జంపింగ్ ఉండదని తేలింది.

కానీ కోమటిరెడ్డి  మాత్రం జంప్ అవ్వడం ఖాయమని తేలింది. ఆయన ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో భేటీ అయ్యారు. దీంతో కోమటిరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్ళడం ఖాయమని తేలిపోయింది. ఈ క్రమంలో ఆయన్ని నిలువరించేందుకు ఇప్పుడు కీలక పదవి ఇచ్చారు.  రాజగోపాల్ రెడ్డిని జాయతీ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. అయితే ఇప్పటికే కోమటిరెడ్డి బి‌జే‌పిలో యాక్టివ్ గా ఉండటం లేదు. ఇప్పుడు  ఈ కొత్త నియామకం తర్వాత మళ్లీ యాక్టివ్‌గా మారతారని పార్టీ శ్రేణులు ఆశిస్తున్నాయి.

అయితే రాష్ట్రంలో బి‌జే‌పి పరిస్తితి ఆగమ్య గోచరంగానే ఉంది. ఆ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలే వచ్చేలా ఉన్నాయి,. బి‌ఆర్‌ఎస్ పార్టీకి పోటీ ఇవ్వడం కష్టం. ఈ పరిస్తితుల్లో కోమటిరెడ్డి బి‌జే‌పిలోనే ఉంటారో..లేక కాంగ్రెస్ లోకి జంప్ అవుతారో చూడాలి.