అందరూ అనుకున్నట్టుగానే మెగా డాక్టర్ నిహారిక, తన భర్త జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకోబోతున్నారని గాసిప్ ని నిజం చేయడం జరిగింది. నిహారిక ,చైతన్య ఇద్దరు కూడా ఇండైరెక్టుగా దూరంగా ఉంటూ హింట్ ఇవ్వడం కూడా జరిగింది. నిన్నటి రోజున ఈ జంట విడాకుల కోసం కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును సైతం ఆశ్రయించినట్టు వార్తలు వినిపించాయి. అయితే మే 19వ తేదీని వీళ్ళు విడాకుల కోసం అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫైనల్ గా నిహారిక, చైతన్య తాము ఇష్ట పూర్వకంగానే విడిపోతున్నామంటూ ఫోటోతో క్లారిటీ ఇవ్వడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే వీళ్ళ విడాకులకు అధి కారణం..ఇది కారణం అంటూ వార్తలు కూడా ఎక్కువగా వినిపించాయి. ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో అమ్మాయిలకు వివాహాలు కలిసి రావడం లేదంటూ పలు రకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈమధ్య ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది.అదేమిటంటే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇన్వాల్వ్ చేసే ఆనవాయితీ మొదలైందని తెలుస్తోంది.
ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. నిహారిక విడాకుల వ్యవహారం గురించి వేణు స్వామి గతంలో చెప్పినట్టే నిహారిక పెళ్లి సమయంలో ఈమె జాతకం గురించి కూడా హెచ్చరించినట్లు తెలుస్తోంది. కానీ కొంతమంది మెగా అభిమానులు మాత్రం వేణు స్వామి గురించి పలు రకాల వార్తలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అతని జాతకం చూసుకోమని వివాహమే చాలా కాలం అవుతున్నా కూడా సంతానం లేదంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వేణు స్వామి చెప్పినటువంటి విషయాలు కొన్ని సందర్భాలలో నిజమయ్యాయని చెప్పవచ్చు.