అత‌న్ని చూడ‌గానే ఆపుకోలేక క‌మిటైపోయా.. షాకింగ్ సీక్రెట్ ను లీక్ చేసిన‌ విద్యా బాలన్!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాల‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. పదహారేళ్ల వయసులోనే న‌ట‌నా జీవితాన్ని ప్రారంభించిన విద్యా బాల‌న్.. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడింది. మ‌ల‌యాళ‌, తమిళ భాష‌ల్లో విద్యా బాల‌న్ న‌టించిన ప‌లు సినిమాలు మ‌ధ్య‌లోనే ఆగిపోవ‌డం, విడుద‌ల‌కు నోచుకోక‌పోవ‌డం వంటివి జ‌ర‌గ‌డంతో ఆమెకు ఐర‌న్ లెగ్ అనే ట్యాగ్ ను త‌గిలించారు.

అయితే ఎన్నో అవ‌మానాల‌ను ఎదుర్కొని.. చివ‌ర‌కు 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. ఆ త‌ర్వాత అనేక చిత్రాల్లో న‌టించింది. సిల్క్‌ స్మిత బయోపిక్ `ది డర్టీ పిక్చర్` మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. నేష‌న‌ల్ వైడ్ గా అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక‌పోతే తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న విద్యా బాల‌న్ త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ కు సంబంధించి అనేక విష‌యాల‌ను పంచుకుంది.

2012 డిసెంబరులో నటుడు, నిర్మాత‌ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ని విద్యా బాల‌న్ ప్రేమ వివాహం చేసుకుంది. అయితే సిద్ధార్థ్ రాయ్ కపూర్ ను తొలి సారి చూసిన‌ప్పుడు త‌న‌కు ప్రేమ కాకుండా కామం పుట్టిందంటూ షాకింగ్ సీక్రెట్ ను విద్యా బాల‌న్ తాజా ఇంట‌ర్వ్యూలో లీక్ చేసింది. `సిద్ధార్థ్ ను చూడ‌గానే Lust At First Sight అని అనిపించింది. అవును, నాకు మొదటి చూపులోనే కామం పుట్టింది. నిజానికి మా మ‌ధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉన్నప్పటికీ ముందుగా ఫిజికల్‌గానే అట్రాక్ట్ అయ్యాం. ఎందుకంటే తను అందగాడు. అలాగే అత‌ను న‌న్ను సెక్యూర్‌గా చూసుకునే విధానం మ‌రింత న‌చ్చింది. నేను మా నాన్నను సెక్యూర్డ్ పర్సన్‌గా భావిస్తాను. ఆయన్ను సిద్ధార్థ్‌లో చూసుకున్నాను. అందుకే సిద్ధార్థ్ ప్రపోజ్ చేయ‌గానే అత‌నికి క‌మిటైపోయా` అంటూ విద్యాబాల‌న్ చెప్పుకొచ్చింది. దీంతో ఈమె బోల్డ్ కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.