పురందేశ్వరితో బీజేపీకి ప్లస్ ఉందా? పొత్తులు సెట్ అవుతాయా?

మొన్నటివరకు తెలంగాణ బి‌జే‌పిలో మార్పులపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి..కానీ ఏపీ గురించి పెద్ద చర్చ లేదు. అయితే సడన్ గా తెలంగాణలో బి‌జే‌పి అధ్యక్షుడుని మార్చడంతో పాటు ఏపీ బి‌జే‌పి అధ్యక్షుడుని మార్చేశారు. సోము వీర్రాజుని మార్చేసి అనూహ్యంగా పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారు. అయితే సోము నాయకత్వంలో ఏపీలో బి‌జే‌పి బలపడలేదు. అదే ఒక శాతం ఓట్లతోనే ఉంది.

పైగా సోము అధికారంలో ఉన్న వైసీపీ కంటే..టి‌డి‌పిని ఎక్కువ టార్గెట్ చేసేవారు. దీని వల్ల సోము..జగన్ మనిషి అని ముద్రపడింది. దీంతో బి‌జే‌పికి మైలేజ్ రాలేదు. అలాగే జనసేనతో పొత్తు ఉన్నా సరే ఎప్పుడు కూడా కలిసికట్టుగా పనిచేయలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో సోముని సైడ్ చేసి పురందేశ్వరిని పెట్టారు. మరి పురందేశ్వరి నాయకత్వంలో ఏపీలో బి‌జే‌పి బలపడుతుందా? అంటే చెప్పడం కష్టమే. ఎందుకంటే రాష్ట్రానికి సరైన న్యాయం చేయని బి‌జే‌పిని ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి ఎవరేమీ చేసిన ఉపయోగం లేదు.

కాకపోతే పురందేశ్వరి..జగన్ ప్రభుత్వంపై ఎలా పోరాడతారు…భవిష్యత్తులో టి‌డి‌పి, జనసేనలతో పొత్తు దిశగా ఆమె కూడా ఏమైనా ముందుకెళ్తారా? అధిష్టానాన్ని మెప్పించేలా పనిచేస్తారనేది చూడాలి. అయితే బి‌జే‌పి అధిష్టానం కూడా భవిష్యత్తులో పొత్తులని దృష్టిలో పెట్టుకుని పురందేశ్వరిని అధ్యక్షురాలుగా నియమించారా? అనే డౌట్ వస్తుంది.

ఆమె ఇప్పటికే జగన్ ప్రభుత్వం టార్గెట్ గా పలు సమస్యలపై గళం విప్పుతున్నారు. అదే సమయంలో కమ్మ వర్గం కాస్త కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయా? అని ప్లాన్ చేసి పురందేశ్వరిని అధ్యక్షురాలుగా పెట్టారా? అనే చర్చ కూడా ఉంది. చూడాలి మరి పురందేశ్వరి నాయకత్వంలో బి‌జే‌పి ఎలా ముందుకెళుతుదో.