భీమిలిపై బాలయ్య చిన్నల్లుడు పట్టు..సైడ్ అవ్వని సందీప్.!

గత ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి ఓటమి పాలైన టీడీపీ నేతల్లో బాలయ్య చిన్నల్లుడు ఒకరు. విశాఖ ఎంపీగా ఈయన బరిలో దిగారు. గెలిచేస్తారని అంతా అనుకున్నారు. కానీ జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో కేవలం 4 వేల ఓట్ల తేడాతో భరత్ ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో భరత్ పనిచేస్తున్నారు. కాకపోతే ఈ సారి అసెంబ్లీ బరిలో ఉండాలని భరత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

గీతం విద్యాసంస్థల అధినేతగా ఉండటంతో..అవి ఉన్న భీమిలిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడ నుంచే పోటీ చేయాలని భరత్ భావిస్తున్నారు. కాకపోతే ఆ సీటు పొత్తులో భాగంగా జనసేన కూడా అడుగుతుంది. దీంతో సీటు విషయంలో కన్ఫ్యూజన్ ఉంది. రెండు పార్టీలు కలిస్తేనే భీమిలిలో గెలవగలవు. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున అవంతి శ్రీనివాస్ 9 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. కానీ ఇప్పుడు ఆయనపై ప్రజా వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. దీంతో ఆయన గెలుపు డౌటే.

అటు టి‌డి‌పి నుంచి ఇంచార్జ్ గా కోరాడ రాజబాబు పనిచేస్తుండగా, జనసేన నుంచి పంచకర్ల సందీప్ పనిచేస్తున్నారు. అయితే టి‌డి‌పి నుంచి భరత్ సీటు ఆశిస్తున్నారు.  అటు సందీప్ ఈ సీటుపైనే ఆశలు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో సందీప్‌కు 24 వేల ఓట్లు వచ్చాయి. ఇప్పుడు అవి మరింత పెరిగే ఛాన్స్ ఉంది. కానీ సింగిల్ గా గెలిచే ఛాన్స్ లేదు. టి‌డి‌పి సపోర్ట్ ఉంటేనే సందీప్ గెలవగలరు.

అటు భరత్‌కు సైతం జనసేనతో పొత్తు ముఖ్యం. అప్పుడే గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే సీటు పొత్తులో ఎవరికి దక్కుతుందో క్లారిటీ లేదు. విశాఖ ఎంపీ సీటు బట్టి..ఈ సీటు ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. ఎంపీ జనసేనకు దక్కితే..భీమిలి టి‌డి‌పికి దక్కే ఛాన్స్ ఉంది. లేదంటే రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడాలి మరి బాలయ్య చిన్నల్లుడుకు ఏ సీటు దక్కుతుందో.