నటుడు అరవిండ్ స్వామి ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

టాలీవుడ్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు నటుడు అరవిందస్వామి.. ముఖ్యంగా రోజా, బొంబాయి, దళపతి తదితర సూపర్ హిట్ చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించారు. వరుసగా సినిమాల తీస్తూ అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరు సంపాదించారు.అయితే ఆ తరువాత 2000 సంవత్సరంలో సడన్గా సినీ ఇండస్ట్రీకి దూరమయ్యారు. అప్పటినుంచి ఎక్కువగా బిజినెస్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో తనకు జరిగిన ఒక రోడ్డు యాక్సిడెంట్ నుంచి కోలుకోవడానికి ఎన్నో సంవత్సరాలు పట్టిందట.

Arvind Swami Wiki, Age, Girlfriend, Wife, Family, Biography & More - WikiBio

దీంతో అరవిందస్వామి ఆస్తి గురించి వ్యాపారం గురించి పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలలో కంటే అరవిందస్వామి బిజినెస్ లో బాగానే సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ధ్రువ సినిమాలో విలన్ గా నటించిన అరవిందస్వామి ఆ తర్వాత పలు చిత్రాలను కీలకమైన పాత్రలో నటించారు. ఒక పక్క బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ అవుతూనే మరొక పక్క నటుడుగా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అరవింద్ స్వామి తండ్రి చెన్నైలో ఒక ప్రముఖ కంటి ఆసుపత్రి ఉన్నదట దీంతో పాటు కొన్ని బిజినెస్ వ్యవహారాలు కూడా చెన్నైలోనే చూసుకుంటున్నట్లు సమాచారం.

Dear Dad a sweet film for Arvind Swamy fans

అరవిందస్వామి మాక్స్ మాన్ అనే ఒక సంస్థని స్థాపించి ఆ సంస్థను డెవలప్మెంట్ చేస్తున్నారట. ఈ సంస్థ వల్ల ఎవరికి ఎక్కడ ఎలాంటి సిబ్బంది కావాలన్నా అరేంజ్మెంట్ చేస్తూ ఉంటారు. ప్రస్తుతం ఈ కంపెనీ విలువ దాదాపుగా 3 వేల కోట్ల పైన ఉన్నట్లు సమాచారం. హాస్పిటల్ తోపాటు పలు వ్యాపారాలతో కలిసి దాదాపుగా 4వేల కోట్ల రూపాయల ఆస్తిని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది అరవిందస్వామి. ప్రస్తుతం అరవింద స్వామి కి సంబంధించి ఈ విషయం వైరల్ గా మారుతోంది.