పెళ్లి కూతురి గెటప్ లో సమంత, ప్రత్యేక పూజలు.. లీకైన వీడియో?

అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మరలా పెళ్లి కూతురు అయిందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ట్రీట్మెంట్ తర్వాత ఎట్టకేలకు కోలుకున్న సామ్ శాకుంతలం చిత్రాన్ని పూర్తి చేసింది. యశోద చిత్రంతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సామ్ విజయ్ దేవరకొండ సరసన మజిలీ ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సమంత హెల్త్ ప్రాబ్లమ్ కారణంగానే ఖుషి షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. కాగా ప్రస్తుతం ఖుషి షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మహానటి తర్వాత విజయ్ దేవరకొండతో సామ్ మరోసారి ఈ మూవీలో నటిస్తోంది.

శివ నిర్వాణ రొమాంటిక్ లవ్ స్టోరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించగా తాజాగా షూటింగ్ లొకేషన్ నుంచి ఓ వీడియో లీక్ అయి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో సమంత విజయ్ దేవరకొండ ఇద్దరూ సాంప్రదాయ వస్త్రధారణలో వధూవరులుగా కనిపించడం మనం గమనించవచ్చు. ఓ టెంపుల్ లో పూజ జరుగుతోంది. చూస్తూనే అర్ధం అయిపోతుంది పెళ్లి సెటప్ లాగా అని. ఇక్కడ రెడ్ శారీలో సమంత ఎంతో అందంగా కనబడుతోంది. ఇక విజయ్ దేవరకొండ అయితే పంచెకట్టుతో కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన నా రోజా నువ్వే సాంగ్ యూట్యూబ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

ఇకపోతే, సమంత మరోసారి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆరోగ్య కారణాల వల్ల సామ్ ఏడాది పాటు షూటింగ్స్ కి దూరంగా ఉండబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనితో తదుపరి చిత్రాలకు తీసుకున్న అడ్వాన్స్ లని నిర్మాతలకు సామ్ తిరిగి ఇచ్చేసినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కాగా సామ్ తరువాత వచ్చే సినిమాలు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలనే విషయం కూడా బాగా వైరల్ అవుతోంది. ఏది ఏమైనా జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ సామ్ కెరీర్లో దూసుకుపోతోంది అనడంలో ఎటువంటి సందేహమే లేదు.