తెలుగు పరిశ్రమలో వివక్షత ఉందంటూ బాంబు పేల్చిన మంచు లక్ష్మి..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచు కుటుంబం నుంచి మంచు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ మంచు లక్ష్మి. ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ అప్పుడప్పుడు పలు రకాల షోలకు హోస్టుగా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటుంది మంచు లక్ష్మి. రెగ్యులర్గా తనకు సంబంధించిన అప్డేట్స్ సైతం షేర్ చేస్తూనే ఉంటుంది తాజాగా మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

Lakshmi Manchu Age, Family, Husband, Movies, Biography - Breezemasti

మంచు లక్ష్మి మాట్లాడుతూ నేను హాలీవుడ్ యాక్టర్ ని అక్కడ చాలా సినిమాలు చేశాను ఇప్పటికీ హాలీవుడ్ లో ఉండి ఉంటే కచ్చితంగా టాప్ స్టార్ అయ్యేదాన్ని అంటూ తెలియజేసింది.. కానీ వివాహమైన తర్వాత పిల్లలు కావాలనుకున్న సమయంలో ఫ్యామిలీతో ఉంటే మంచిదని ఇండియాకి వచ్చేసానని తెలియజేసింది. ప్రస్తుతం తన పాపకి తొమ్మిదేళ్లు వచ్చాయి తనకు ఫ్రీడం వచ్చిందని తెలియజేసింది ఎక్కడికైనా వెళ్లవచ్చు అంటూ తెలియజేసింది మంచు లక్ష్మి. మళ్లీ అదృష్టం బాగా కలిసొస్తే హాలీవుడ్లో అవకాశం వస్తే వెంటనే వెళ్ళిపోతాను అంటూ తెలియజేసింది.

ఇక్కడ ఎంత చేసినా కూడా గుర్తింపు రాదు తెలుగు దర్శక నిర్మాతలకు కేవలం పక్క రాష్ట్ర అమ్మాయిలే కావాలంటూ తెలియజేసింది.. ఆడియన్స్ కూడా ఎక్కడి నుంచో వచ్చిన వారినే ప్రేమిస్తారు.. ఇంట్లో ఊరిలో ఉండే అమ్మాయిని ఒక్క శాతం కూడా ప్రేమించి ప్రోత్సహించరు. అలాంటి వారిని ప్రోత్సహించిన టాప్ లో ఉండేవారు అంటూ తెలియజేసింది. తెలుగు సినిమాలు చూసే వారికి తెలుగమ్మాయిలు నచ్చడం లేదని ఆవేదన తెలియజేస్తోంది.. తన కెరియర్లలో నిహారిక ,బిందు మాధవి, మధుశాలిని, శివాని వంటి తెలుగు అమ్మాయిలు టాలీవుడ్ లోనే ఉన్నారు. కానీ విరు ఇప్పుడు సినిమాలు చేయడం లేదు.అందుకు అవకాశాలు కూడా ఇవ్వడం లేదు. మనవాళ్ళకి పక్క రాష్ట్రాల అమ్మాయిలే ఎక్కువ ఇష్టం వారిని చూడడానికి ఇష్టపడతారంటూ తెలియజేస్తోంది.