ఉదయగిరి వైసీపీకి కొత్త అభ్యర్ధి..మేకపాటికి చెక్ పెట్టేలా.!

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీకి తలనొప్పులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ పార్టీపై వ్యతిరేకత పెరుగుతూ రావడం ఇదే సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి దూరం కావడంతో సీన్ మారిపోయింది. ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి..ఈ ముగ్గురు వైసీపీ నుంచి బయటకొచ్చారు. టి‌డి‌పిలో చేరడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరులో కొనసాగుతుంది.

ఈ క్రమంలో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లోకేష్ పాదయాత్రకు మద్ధతు తెలుపుతున్నారు. ఇప్పటికే ఆనం, మేకపాటి లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. కోటంరెడ్డి సైతం పాదయాత్రలో పాల్గొనడానికి రెడీ అవుతున్నారు. అయితే ఈ ముగ్గురుకు చెక్ పెట్టేలా ఆయా స్థానాల్లో వైసీపీ నుంచి బలమైన అభ్యర్ధులని సైతం రెడీ చేస్తున్నారు. ఇప్పటికే వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పెట్టగా, నెల్లూరు రూరల్ లో ఆదాల ప్రభాకర్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు.

ఇక ఉదయగిరిలో అనేక చర్చలు తర్వాత మేకపాటి రాజారెడ్డిని ఇంచార్జ్ గా పెట్టారు. ఈయన వైసీపీ నుంచి సస్పెండ్ అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు. ఈయన చంద్రశేఖర్ సైడ్ అవ్వడంతో..ఆయన కుమార్తె రచనా రెడ్డిని ఇంచార్జ్ గా పెట్టించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి ప్రయత్నించారు. కానీ ఆమె సుముఖంగా లేకపోవడంతో..మరో సోదరుడు రాజారెడ్డిని పెట్టారు.

అయితే ఉదయగిరి సీటు కోసం  మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మెట్టుకూరు చిరంజీవి రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి ఇలా పలువురు నేతలు పోటీలో ఉన్నారు. ఇప్పుడు రాజారెడ్డి లైన్ లోకి రావడంతో వారు సైడ్ అయ్యే పరిస్తితి. మొత్తానికి ఉదయగిరిలో వైసీపీ అభ్యర్ధిగా రాజారెడ్డి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.