బాలీవుడ్ లో తక్కువ సమయంలో స్టార్ హోదాను అందుకుని బిజీ బ్యూటీగా పేరు సంపాదించుకున్న కియారా అద్వానీ.. ఇటీవలె ఓ ఇంటిది అయింది. కెరీర్ పీక్స్ లో ఉండగానే ప్రియుడు సిద్ధార్థ్ మల్హోత్రాతో ఏడడుగులు వేసింది.
అయితే పెళ్లి అయినా సరే కియారా కెరీర్ పరంగా యమా జోరు చూపిస్తోంది. ప్రస్తుతం ఈ అమ్మడు `సత్య ప్రేమ్ కీ కథ` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సమీర్ విద్వాంస్ ఈ మూవీకి దర్శకుడు.
ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా జంటగా నటించారు. `భూల్ భులయ్య 2`వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ఇది. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తెలుగులో కియారా రామ్ చరణ్ కు జోడీగా `గేమ్ ఛేంజర్` మూవీలో నటిస్తోంది.
మరికొన్ని ప్రాజెక్ట్ లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. కియారా తాజా ఫోటో షూట్ ఇప్పుడు నెట్టింట పెను దుమారం రేపుతోంది. రెడ్ కలర్ ట్రెండీ డ్రెస్ లో సూపర్ హాట్ గా దర్శనమిచ్చిన కియారా.. టాప్ షోతో టాప్ లేపేసింది.
బిగుతైన పరువాలను కుర్రకారు ఎరగా వేస్తూ కొంప కొల్లేరు చేసింది. ఇకపోతే కియారా ధరించిన ఆ రెడ్ డ్రెస్ ధర తెలిస్తే దిమ్మ తిరుగుద్ది.
ఎందుకంటే చాలా సింపుల్ గా ఉన్న ఆ డ్రెస్ ఖరీదు అక్షరాల రూ.2.6 లక్షలు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకైపోతున్నారు. రెండున్నర లక్షల ఖరీదు చేసే ఆ డ్రెస్ లో ఏముంది అంటూ జుట్టు పీక్కుకుంటున్నారు.