విడాకులు తీసుకోబోతున్న యాదమ్మ రాజు – స్టెల్లా .. వేగలేమంటూ.!

బుల్లితెర కమెడియన్ గా అభిమానుల మనసులో మంచి పేరు సంపాదించుకున్న యాదమ్మ రాజు అమాయకుడిగా కనిపిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడంలో ముందు ఉంటాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో సద్దాం టీమ్ లో కంటెస్టెంట్ గా కనిపిస్తున్నాడు. అతని భార్య స్టెల్లా కూడా అందరికీ తెలిసిందే… ఒక టీవీ ప్రోగ్రాంలో ఆమెను తీసుకొచ్చి యాదమ్మ రాజుకు సర్ప్రైజ్ ఇవ్వడంతో వీరి ప్రేమ బయటపడింది.
గతేడాది వీరిద్దరూ పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.

yadamma raju • ShareChat Photos and Videos

స్టెల్లా… భర్త పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ ను ఓపెన్ చేసి షోలు ఈవెంట్స్ అంటూ తిరుగుతూ బాగానే డబ్బు సంపాదిస్తోంది. ఈ మధ్యనే వీరు ఒక డాన్స్ షోకి జంటగా వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ఈ జంట తాము విడాకులు తీసుకున్నట్లు తెలిపి షాక్ ఇచ్చారు. అయితే అది ఒరిజినల్ కాదు.. కానీ జంట విడిపోతున్నట్లు తెలిపారు. బుల్లితెర కామెడీ షో లో ప్రతివారం ఒక టీం తో కామెడీ చేస్తూ ఉంటారు.

ఈసారి యాదమ్మ రాజ్ ..స్టెల్లా విడాకులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు చూపించడం జరుగుతోంది . నీతో నా వల్ల కావడం లేదు నాకు విడాకులు కావాలని స్టెల్లా అడుగుతుంది. అంతేకాకుండా ఈ విడాకులు కూడా ఒక ఫంక్షన్లలా జరగాలని చెప్పడంతో ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. ఇదంతా ప్రమోషన్స్ స్టన్స్ అని తెలుస్తోంది. అయినా అంతగా నచ్చలేదని అభిమానులు విమర్శిస్తున్నారు. ప్రమోషన్స్ కోసం ఎలాంటి పనిచేయడానికైనా బుల్లితెర పై పలు షోలు ఇలాంటి ప్రయోగాలు చేస్తూ ఉంటాయంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్.