బుచ్చయ్యకు సీటు ఫిక్స్..జనసేనకు ఛాన్స్ లేనట్లే.!

వచ్చే ఎన్నికల్లో టి‌డి‌పి, జనసేన పొత్తులో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక పొత్తులో టి‌డి‌పి…జనసేనకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందనేది పెద్ద చర్చగా మారింది. ఎలాగో జనసేనకు అన్నీ స్థానాల్లో పెద్ద పట్టు లేదు. కాబట్టి ఆ పార్టీ పెద్దగా త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఇక త్యాగం చేయాల్సింది టి‌డి‌పినే..ఆ పార్టీకి అన్నీ స్థానాల్లో పట్టుంది. దీనివల్ల టి‌డి‌పి త్యాగం చేయాల్సి ఉంది.

ఇప్పటికే కొన్ని స్థానాలని జనసేనకు వదులుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇదే సమయంలో టి‌డి‌పికి బలం ఉన్న కొన్ని సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది. ఆ సీట్లు దక్కించుకోవాలని చూస్తుంది. ఇదే క్రమంలో రాజమండ్రి రూరల్ సీటు సైతం దక్కించుకోవాలని జనసేన చూస్తుంది. కానీ అక్కడ టి‌డి‌పి సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరీ ఉన్నారు. ఇప్పటికే టి‌డి‌పి సిట్టింగులకే సీటు అని చంద్రబాబు ప్రకటించారు. పైగా బుచ్చయ్య లాంటి సీనియర్‌ని కాదని ఆ సీటు జనసేనకు ఇవ్వడం అసాధ్యం.

గతంలో రాజమండ్రి సిటీ నుంచి 4 సార్లు..రూరల్ నుంచి బుచ్చయ్య రెండుసార్లు గెలిచారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్ లో కూడా గెలిచారు. అయితే రూరల్ లో జనసేనకు 40 వేల ఓట్లు వరకు పడ్డాయి. ఇప్పుడు తమ బలం మరింత పెరిగిందని ఆ పార్టీ భావిస్తుంది. కానీ టి‌డి‌పికి అక్కడ పట్టుంది. పైగా సిట్టింగ్ సీటు కాబట్టి వదిలే ప్రసక్తి ఉండదు.

ఇప్పటికే బుచ్చయ్య సైతం తాను రాజమండ్రి రూరల్ నుంచే పోటీ చేస్తానని, ఆల్రెడీ చంద్రబాబు చెప్పేశారని, ఈ సీటు జనసేనకు ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో బుచ్చయ్య ఇలా క్లారిటీ ఇచ్చేశారు.