ప్రత్తిపాడులో సైకిల్ జోరు..మూడోసారైనా గెలుస్తుందా?

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం..టి‌డి‌పి కంచుకోట..1983 నుంచి 2009 వరకు టి‌డి‌పి అయిదుసార్లు గెలిచింది. కానీ 2014 నుంచి టి‌డి‌పికి లక్ కలిసిరావడం లేదు. వరుసగా రెండుసార్లు ఓడిపోయింది. అది కూడా తక్కువ మెజారిటీలతో 2014లో 3 వేల ఓట్లతో, 2019 ఎన్నికల్లో 4 వేల ఓట్ల తేడాతో టి‌డి‌పి ఓడింది.

కానీ ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలవాలని చెప్పి టి‌డి‌పి కష్టపడుతుంది. ఇదే క్రమంలో దివంగత వరుపుల రాజాని పార్టీని బలోపేతం చేశారు. గత ఎన్నికల్లో ఆయనే టి‌డి‌పి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. కొన్ని రోజులు పార్టీకి దూరంగా ఉన్న మళ్ళీ యాక్టివ్ అయ్యి, పార్టీలో పనిచేశారు. ప్రజా సమస్యలపై పోరాడుతూనే..పార్టీని బలోపేతం చేశారు.అటు వైసీపీ ఎమ్మెల్యే పర్వత పూర్ణ చంద్రప్రసాద్ పై వ్యతిరేకత గట్టిగానే కనిపిస్తుంది. గత ఎన్నికల్లో జగన్ గాలి,జనసేన ఓట్లు చీల్చడం వల్ల గెలిచారు. ఈ సారి ఆ పరిస్తితి కనిపించడం లేదు.

అయితే పార్టీని ఆధిక్యంలోకి తీసుకొచ్చాక రాజా గుండెపోటుతో మరణించారు. దీంతో ప్రత్తిపాడు టి‌డి‌పి బాధ్యతలు ఆయన భార్య సత్యప్రభకు ఇచ్చారు. నెక్స్ట్ ఆమె పోటీ చేయనున్నారు. ఇదిలా ఉంటే జూన్ 14న పవన్ కల్యాణ్ వారాహి బస్సు యాత్ర ప్రత్తిపాడులోనే మొదలుకానుంది. ఈ యాత్ర టి‌డి‌పికి కలిసి రావచ్చు. ఎలాగో ఈ సీటు టి‌డి‌పికే దక్కుతుంది.

ఎందుకంటే గత ఎన్నికల్లో ఇక్కడ జనసేనకు 6 వేల ఓట్లే వచ్చాయి. కాబట్టి ఇక్కడ టి‌డి‌పి నుంచి సత్యప్రభ పోటీ చేయడం ఖాయం..వరుసగా రెండుసార్లు ఓడిన టి‌డి‌పి మూడోసారి గెలిచే ఛాన్స్ ఉంది.