తెర వెనుక నటి అభినయ గురించి తెలియని విషయాలు ఇవే..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మాటలు రాకుండా వినపడకుండా నటిగా పేరుపొందింది నటి అభినయ.. ఈమె అద్భుతమైన నటన అద్భుతమైన హావభావాలు సైతం ప్రేక్షకులకు చేరువయ్యేలా చేశాయి.. సినిమాలకు పనికిరాదనుకున్న ఇమే.. ప్రత్యేకమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని చెప్పవచ్చు అభినయ.. సౌత్ లో బిజీ యాక్టర్ గా మారిపోయింది. మొదట శంభో శివశంభో సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.. తాజాగా అభినయకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వైరల్ గా మారుతున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

Abhinaya - IMDb
అభినయ చిన్న వయసు నుంచి మూగ ,చెవిటి సమస్యలతో బాధపడుతూ ఉండేదట. అయితే తను మాటలు తెప్పించేందుకు ఆమె కుటుంబ సభ్యులు ఎన్నో బాధలు పడ్డారని తెలుస్తోంది. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశారట. ఎలాగైనా తనకి మాటలు వినికిడి తెప్పించేందుకు పలు ప్రయత్నాలు చేసిన అవి విఫలం అయ్యాయట. ఎన్నో ఆసుపత్రిలో చుట్టూ తిప్పిన ఫలితం లేకుండా పోయిందని తెలుస్తోంది. అభినయ ట్రీట్మెంట్ కోసం కుటుంబ సభ్యులు అప్పు చేసి మరి చేయించారట.

Abhinaya Wiki, Affairs, Today Omg News, Updates, Hd Images Phone Number

దాదాపుగా రూ .20 లక్షల రూపాయల వరకు ఖర్చయినట్టు సమాచారం. బంధువులు స్నేహితులు ఇలా అందరి వద్ద అప్పు తెచ్చి అభినయకు ట్రీట్మెంట్ చేయించిన ఎలాంటి ప్రయోజనం లేదట. ఎంతో శ్రమించి లక్షల కోసి ఖర్చు చేసిన ప్రయోజనం లేకపోవడంతో కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం అభినయ తన ముఖ కవళికలతో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుందట. నటనపై ఇష్టాన్ని పెంచుకోవడంతోనే ఆమె నటిగా మారింది. హీరోయిన్లకు ఏమాత్రం తగ్గిపోని అందంతో ఈ ముద్దుగుమ్మ ఉంటుంది. ఏడవ తరగతి లోని అభినయ చైల్డ్ యాక్టర్ గా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం తమిళంలో హిట్టు కావడంతో తెలుగులో కూడా అవకాశాలు వచ్చాయి దాదాపుగా రెండు నంది అవార్డులను వరుసగా అందించుకుంది అభినయ. ప్రస్తుతం పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉంది.