మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తీవ్ర శోకంలో మునిగిపోయాడు. అతడికి ఎంతో ఇష్టమైన పెంపుడు శునకం చనిపోయింది. ఎన్నో ఏళ్ల నుంచి టాంగో అనే పెట్ డాగ్ ను సాయి ధరమ్ తేజ్ పెంచుకుంటున్నాడు. టాంగోను తేజ్ ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. టాంగో సైతం తేజ్ పట్ల చాలా ఆప్యాయంగా ఉండేది.
కానీ, తాజాగా టాంగో పలు ఆరోగ్య సమస్యలతో మృతి చెందింది. దీంతో టాంగో జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సాయి ధరమ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. `టాంగో.. నువ్వు లేవు అనే విషయాన్ని తట్టుకోలేక పోతున్నాను. నువ్వు మళ్లీ తిరిగి రావు అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను నువ్వు ఎన్నోసార్లు కాపాడావు. బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇచ్చావు.. నవ్వించాడు. కష్టసుఖాల్లో నాకు తోడుగా ఉన్నావు.
నీ ప్రేమను అంతా నాకు పంచావు. నువ్వు నా జీవితంలోకి రావడం నా అదృష్టం. నా దగ్గరికి వచ్చిన తొలి రోజు నుంచి ఇప్పటికి వరకు ఎన్నో జ్ఞాపకాలు నీతో ఉన్నాయి. లవ్ యు మై బండ ఫెలో, టాంగో` అంటూ తేజ్ తన పోస్ట్ లో రాసుకొచ్చింది. టాంగోను ఎంత మిస్ అవుతున్నానో తేజ్ తెలపడంతో.. ఫ్యాన్స్ ఆయన ఓదారుస్తున్నారు. కాగా, బైక్ యాక్సిడెంట్ తర్వాత `విరూపాక్ష` మూవీతో రీసెంట్ గా గ్రాండ్ రీఎంట్రీ ఇచ్చిన తేజ్.. ప్రస్తుతం మావయ్య పవన్ కళ్యాణ్ తో `బ్రో` మూవీ చేస్తున్నాడు. మరికొన్ని ప్రాజెక్ట్స్ కూడా తేజ్ చేతిలో ఉన్నాయి.