జగన్ వేటు వేసే ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై కష్టమే?

గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఆయన సమీక్షా సమావేశం పెట్టి..18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు వెళ్ళడం లేదని వారి పేర్లు బహిరంగంగా చెప్పనని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..వారు గడపగడపకు వెళ్లనంత మాత్రాన సీటు ఇవ్వకుండా ఉంటారా? అసలు గడపగడపతోనే గ్రాఫ్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి.

మొదట గడపగడపకు వెళ్లని వారు అంటూ..సోషల్ మీడియాలో ఓ లిస్ట్ నడుస్తుంది..  మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, మేకతోటి సుచరిత, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, అవంతి శ్రీనివాసరావు, , పాముల పుష్పశ్రీవాణి గడపగడపలో పాల్గొనడంలేదని సీఎంకు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలలో గ్రంధి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్‌, కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి ఉన్నారని తెలిసింది.

అటు మంత్రుల్లో గుడివాడ అమర్నాథ్‌, పినిపె విశ్వరూప్‌, తానేటి వనిత, జోగి రమేశ్‌, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, రోజా పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సీనియర్ మంత్రులైన బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..వీరికి గడపగడప మినహాయింపు ఇచ్చారని తెలిసింది. అయితే గడపగడపకు వెళ్లని వారికి సీటు ఇవ్వనని జగన్ అంటున్నారు.

కానీ లిస్ట్ చూస్తే..దాదాపు చాలామంది ప్రజా బలం ఉన్నవారే. కాబట్టి వారికి సీట్లు ఇవ్వకుండా ఉండలేరు. అయితే గడపగడపకు వెళ్లకపోవడం, పనితీరు గ్రాఫ్ ఒకటి కాదనే చెప్పాలి. గడపగడపకు కేవలం పథకాలు అందుతున్న వారి ఇళ్లకు వెళ్లడమే, కానీ నియోజకవర్గంలో ఎలా పనిచేస్తున్నారనేది ముఖ్యం. కాబట్టి గడపగడపకు వెళ్లకపోతే సీటు దక్కదనేది లేదు.