నోరు జారిన బాల‌య్య‌.. `భ‌గ‌వంత్ కేస‌రి`లో శ్రీ‌లీల రోల్ ఎలా ఉండ‌బోతుందో తెలుసా?

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో `భగవంత్‌ కేసరి` అనే మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక మాస్‌ యాక్షన్ ఎంటర్టైనర్. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్ పై నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే యంగ్ బ్యూటీ శ్రీలీల, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. థ‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్నారు.

షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం దసరా పండుగ కానుకగా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ చిత్రంలో బాలయ్య కూతురుగా శ్రీలీల కనిపించనుంద‌ని ఎప్ప‌టి నుంచో టాక్ ఉంది. అయితే తాజాగా శ్రీ‌లీల పాత్రకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సినిమాలో ఆమె ఒక ఫైట‌ర్ గా అల‌రించ‌బోతోంద‌ట‌. ఈ విష‌యాన్ని బాల‌య్య స్వ‌యంగా లీక్ చేశారు.

బాలకృష్ణకి చెందిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి 23వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో బాలయ్యతో పాటు పివి సింధు, హీరోయిన్ శ్రీలీల అతిథులుగా హాజరయ్యారు. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో బాలయ్య ప్రసంగిస్తూ.. శ్రీ‌లీల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. శ్రీలీల చాలా బిజీగా గడుపుతోంది ఉదయాన్నే మా సినిమా భగవంత్ కేసరిలో ఫైట్స్ చేసి ఇక్కడికి వచ్చింది అంటూ నోరు జారారు. ఈ ఫైట్స్ కోసం ఆమె ట్రైనింగ్ కూడా తీసుకుంది.. తెర‌పై ఆమె అద్భుత న‌ట‌న చూసి మీరే ఆశ్చ‌ర్య‌పోతారు అంటూ బాల‌య్య పేర్కొన్నారు. ఈయ‌న వ్యాఖ్య‌ల‌తో శ్రీ‌లీల పాత్ర‌కు యాక్ష‌న్స్ సీక్వెన్స్ లు కూడా ఉంటాయ‌ని తేలిపోయింది. దీంతో శ్రీ‌లీల ఫ్యాన్స్ భ‌గ‌వంత్‌ కేస‌రిపై మ‌రింత ఎగ్జైట్ అయిపోతున్నారు.