స్టార్ హీరో ఆనందం కోసం అమ్మ-నాన్నలకు ఇష్టం లేని పని చేస్తున్న స్టార్ హీరోయిన్..!

ఎస్ ..ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ కీర్తి సురేష్ తన తల్లిదండ్రులకు ఇష్టం లేని పని చేస్తుందా..? అంటే అవును అన్న సమాధానం వినిపిస్తుంది . దానికి కారణం ఓ స్టార్ హీరో అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని మహానటిగా ట్యాగ్ చేయించుకున్న హోమ్లీ బ్యూటీ కీర్తి సురేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే . నేను శైలజ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత మంచి మంచి హిట్స్ తన ఖాతాలో వేసుకుంది .

మహానటి సినిమాతో ఇండస్ట్రీ చరిత్ర తిరగరాసే హీరోయిన్గా మారిపోయింది . ఆ తరువాత హిట్స్ కొట్టిన కీర్తి సురేష్ మహానటి అంత క్రేజ్ మాత్రం దక్కించుకోలేకపోయింది. భోళా శంకర్ ఫ్లాప్ అవడంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన కీర్తి బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ లో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది . అంతేకాదు ఈ సినిమాలో వరుణ్ ధావన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ .

ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలకు కూడా కమిట్ అవుతూ వస్తుంది . రీసెంట్గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తో ఒక సినిమాకి కమిట్ అయిందట . ఈ సినిమా రెగ్యులర్ షెడ్యూల్స్ కోసం కీర్తి సురేష్ చెన్నై నుంచి ముంబైకి వెళ్లలేకపోతుందట. ఆ కారణంగానే ముంబైలోనే ఒక ఇల్లు తీసుకొని ఇక్కడే ఉండిపోవాలి అంటూ డిసైడ్ అయిందట . అయితే తల్లిదండ్రులకు మాత్రం ఆమె ముంబైలో ఉండడం ఇష్టం లేదట. కానీ అక్షయ్ కుమార్ తో సినిమాను వదులుకోవడం కూడా కీర్తి సురేష్ కి ఇష్టం లేదట. ఆ కారణంగానే తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా సరే ఆమె ముంబైలో ఉండడానికి నిర్ణయం తీసుకుందట..!!