నటబ్రహ్మ బ్రహ్మానందం ట్యాలెంట్‌ ను వాడుకునే దర్శకుడు ఇక్కడ లేడా?

నటబ్రహ్మ బ్రహ్మానందం గురించి సినిమా ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బ్రహ్మానందం వెయ్యి కి పైగా సినిమాల్లో నటించిన సంగతి విదితమే. కొన్నాళ్ల క్రితం బ్రహ్మానందంలేని సినిమాలను ఊహించుకోవడం కూడా కష్టంగా ఉండేది. స్టార్ హీరోల సినిమాల్లో నూటికి 95 శాతం సినిమాల్లో బ్రహ్మానందం ఉండాల్సిందే. బ్రహ్మీ డేట్ల కోసం స్టార్ హీరోల సినిమాలు కూడా వాయిదా పడ్డ సందర్భాలు తెలుగు సినిమా చరిత్రలో అనేకం. అలాంటి బ్రహ్మానందం ఇప్పుడు మచ్చుకైనా కనిపించడం లేదు. చిన్న చిన్న సినిమాల్లో రెండు మూడు నిమిషాలు కనిపించే పాత్రల్లో నటిస్తున్న పరిస్థితి వుంది.

ఆ మధ్య బ్రహ్మానందం రంగమార్తాండ సినిమాలో నటించి మెప్పించిన సంగతి విదితమే. నవ్వించే బ్రహ్మానందం ఈ సినిమాలో ఏడిపించాడు. అద్భుతమైన నటన ప్రతిభ కలిగిన బ్రహ్మానందంను ఈ తరం దర్శకులు వినియోగించుకోవడంలో ఘోరంగా విఫలం అవుతున్నారు అనే విషయం ఈ సినిమాను చూస్తేనే అర్ధం అవుతుంది. బ్రహ్మానందంను కేవలం ఇక్కడ ఓ కమెడియన్ గానే చూస్తారు. కానీ అయన ఓ సీరియస్ రోల్ చేస్తే ఎలా ఉంటుందో దర్శకుడు చేసి చూపించాడు. ఇక ఆయన కామెడీ అంటే పడి చచ్చే వారు కోట్లల్లో ఉన్నారు. అయినా కూడా ఆయన యొక్క ప్రతిభను సద్వినియోగం చేసుకోవడంలో నేటితరం దర్శకులు ఫెయిల్ అవుతున్నారని వినికిడి.

బ్రహ్మానందం యొక్క సినిమాలు ఇక ముందు అయినా రావాలని అభిమానులు కోరుకుంటున్నారు. బ్రహ్మీ యొక్క ప్రతిభను సినీ దర్శకులు వినియోగించుకోక పోవడం వల్లే ఆయన సినిమాలు రావడం లేదు అన్న విమర్శలు వున్నాయి. బ్రహ్మానందం గతంలో భారీ పారితోషికంను అందుకున్న విషయం అందరికీ తెలిసినదే. ప్రస్తుతం బ్రహ్మానందం చేస్తున్న సినిమాలు ఏమీ లేవు. ఇక ఆయన కామెడీని తెలుగు ప్రేక్షకులు ఎంజాయ్ చేయాలని పడిగాపులు చూస్తున్నారు. ముఖ్యంగా ఈతరం ప్రేక్షకులు ఆయన కామెడీ కోసం ఎదురు చూస్తున్నారు. మళ్లీ వెండి తెరపై హాస్యబ్రహ్మ చెవాక్కులు చూస్తామా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న?