జబర్దస్త్ కొత్త యాంకర్ పరువాల విందు… గ్లామర్ డోస్ తట్టుకోలేకపోతున్న యువత!

జబర్దస్త్ కొత్త యాంకర్ సౌమ్యరావు గురించి అందరికీ తెలిసినదే. ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటో షూట్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది. ఆమె నాజూకు నడుముని చూసిన కుర్రకారు మతులు పోతున్నాయి. దాంతో సౌమ్యరావు గ్లామర్ ట్రీట్ కేక అంటున్నారు నెటిజెన్స్! పర్పుల్ కలర్ డ్రెస్ లో సౌమ్యరావు మోతంగా పరువాల విందు చేసిందని చెప్పుకోవచ్చు. ఇక మనోళ్లు ఊరుకుంటారా? నెటిజెన్స్ కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు. బేసిగ్గా కన్నడ సీరియల్ నటి, న్యూస్ రిపోర్టర్ అయినటువంటి సౌమ్య రావు గత ఏడాది జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చింది. అనసూయ జబర్దస్త్ నుండి తప్పుకోగా ఆమెకు ఛాన్స్ దక్కింది.

ఈ పొజీషన్ కోసం ఎందరో తెలుగు యాంకర్స్ పోటీపడగా అనూహ్యంగా పక్క రాష్ట్రం పిల్ల లక్కీ ఆఫర్ కొట్టేసింది. ఇంకేముంది, కట్ చేస్తే సౌమ్యరావు అదృష్టానికి చాలా మంది యాంకర్స్ కుళ్ళుకుంటున్నారు. కారణం ఈ షో రష్మీ, అనసూయల ఫేట్ మార్చేసింది. సామాన్యులను స్టార్స్ చేసింది ఈ షోనే. దాంతో చాలామంది ఈ షో కోసం అప్లికేషన్లు పెట్టుకుంటూ వుంటారు. కానీ ఆ అదృష్టం ఈమెకు మాత్రమే దక్కింది. సౌమ్యరావు వచ్చేవరకు రష్మీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ యాంకర్ రోల్ చేశారు. అయితే జబర్దస్త్ షోకి వచ్చిన సౌమ్య రావు అతిపెద్ద బాధ్యత భుజాలకు ఎత్తుకున్నారు.

గత 6 నెలల పెరఫామెన్స్ గమనిస్తే సౌమ్యరావుకు జస్ట్ పాస్ మార్క్స్ వేయొచ్చు. ఎందుకంటే అనసూయ మాదిరి ఆమె షోకి అట్రాక్షన్ కాలేకపోతున్నారు. అదే సమయంలో జబర్దస్త్ కూడా మునుపటి వైభవం కోల్పోయింది. సౌమ్యరావు శక్తిమేర ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తోంది గానీ నడవడం లేదు. ఇక సౌమ్యకు ఎపిసోడ్ కి రూ. 1 లక్ష నుండి 1.5 లక్షల మధ్య ఇస్తున్నారట. అంటే ఇది రష్మీ, అనసూయ రెమ్యూనరేషన్ కంటే ఇది చాలా తక్కువ. ఎందుకంటే రష్మీ ఎపిసోడ్ కి రూ. 2 లక్షలకు పైనే తీసుకుంటున్నారు. సౌమ్య రావు పెర్ఫార్మన్స్ బాగుండి, ఆమె ప్రెజెన్స్ షోకి ప్లస్ అయితే రెమ్యూనరేషన్ పెంచుతామని హామీ ఇచ్చారట.