గుంటూరు సిటీలో కన్ఫ్యూజన్..టీడీపీలో భారీ పోటీ.!

గుంటూరు నగరం తెలుగుదేశం పార్టీకి 2014 నుంచి పట్టు పెరిగిన ప్రాంతం. కానీ టి‌డి‌పికి బలం ఉన్నది ఒక గుంటూరు వెస్ట్ లోనే..మళ్ళీ గుంటూరు ఈస్ట్ లో వైసీపీ హవా ఎక్కువ. ముస్లిం వర్గం ఎక్కువగా ఉన్న ఈస్ట్ లో వైసీపీ హవా ఉంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ సత్తా చాటేది. ఇక 2014 నుంచి గుంటూరు ఈస్ట్ లో వైసీపీ, గుంటూరు వెస్ట్ లో టి‌డి‌పి గెలుస్తూ వస్తున్నాయి.

గుంటూరు ఈస్ట్ లో వైసీపీ రెండుసార్లు గెలవగా, వెస్ట్ లో టి‌డి‌పి రెండుసార్లు గెలిచింది. ఇక ఈ సారి రెండు సీట్లని కైవసం చేసుకోవాలని చెప్పి టి‌డి‌పి చూస్తుంది. ఇదే సమయంలో జనసేనతో పొత్తు కలిసిరానుంది. పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది..ఇటు అమరావతి రాజధాని ప్రభావం ఉంది. గుంటూరు వెస్ట్ లో టి‌డి‌పి నుంచి గెలిచిన మద్దాలి గిరి వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే.

దీంతో అక్కడ టి‌డి‌పి ఇంచార్జ్ గా కోవెలమూడి రవీంద్ర పనిచేస్తున్నారు. అయితే ఈ సీటు కోసం చాలామంది నేతలు రేసులో ఉన్నారు. అదే సమయంలో జనసేనతో పొత్తు ఉంది కాబట్టి..ఆ పార్టీ కూడా ఈ సీటుపై ఫోకస్ పెట్టింది. ఇక ఈస్ట్ లో సీటులో అదే పరిస్తితి ఉంది. టి‌డి‌పి, జనసేనలో ఎవరికి సీటు దక్కుతుందో క్లారిటీ లేదు. గత ఎన్నికల్లో టి‌డి‌పిపై వైసీపీ 22 వేల ఓట్ల మెజారిటీతో గెలిస్తే అక్కడ జనసేనకు 21 వేల ఓట్లు పడ్డాయి. అంటే టి‌డి‌పి, జనసేన కలిస్తే దాదాపు ఫలితం మారేది.

ఇప్పుడు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయి కాబట్టి..వెస్ట్, ఈస్ట్ లో వైసీపీకి చెక్ పడటం ఖాయం. అలాగే పొత్తులో భాగంగా చెరోక సీటు టి‌డి‌పి, జనసేన తీసుకునే ఛాన్స్ ఉంది.