శ్రీ‌లీల బ‌ర్త్‌డేకి ఎన్ని స‌ర్‌ప్రైజ్‌లో.. కానీ, ఆ ఒక్క‌టే హైలెట్‌!

టాలీవుడ్ లో యంగ్‌ సెన్సేషన్ గా మారిన శ్రీలీల.. ఇండ‌స్ట్రీలోకి వచ్చి రెండేళ్లు కాకముందే చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో తోటి హీరోయిన్లకు చెమటలు పట్టిస్తున్న సంగతి తెలిసిందే.

అటు యంగ హీరోలతో పాటు ఇటు స్టార్ హీరోలతోనూ జత కడుతూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తుంది. అయితే నేడు ఈ ముద్దుగుమ్మ బర్త్‌డే.

ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న సినిమాల నుంచి సర్ప్రైజ్ పోస్టర్ లు ఉద‌యం నుంచి ఒక్కొక్క‌టిగా విడుదల అవుతూనే ఉన్నాయి. ఇలా ఒకటి కాదు రెండు కాదు అర డ‌జ‌న్ కు పైగా సినిమా పోస్టర్లు నెట్టింట సందడి చేస్తున్నాయి.

మ‌హేష్ బాబు గుంటూరు కారం, బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి, రామ్-బోయ‌పాటి మూవీ, నితిన్ 32వ చిత్రం, వైష్ణ‌వ్ తేజ్ ఆదికేశ‌వ‌.. ఇలా శ్రీ‌లీల న‌టిస్తున్న ప్ర‌తి సినిమా నుంచి ఆమె బ‌ర్త్‌డే పోస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

అయితే వీటిలో ఒకటి మాత్రం బాగా హైలెట్ అయింది. ఆహా కోసం అల్లు అర్జున్ చేయబోతున్న ఓ ప్రాజెక్టులోనూ శ్రీలీల భాగం అయింది.

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైరెక్ట్ చేయ‌నున్న `ఆహా ఒరిజినల్‌` వీరిద్ద‌రూ జంట‌గా న‌టించ‌బోతున్నారు. తాజాగా వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోను ఆహా టీమ్ రిలీజ్ చేసింది.

ఇందులో శ్రీ‌లీల ఏకంగా అల్లు అర్జున్ చంకనెక్కి కూర్చుంది. కిర్రాక్ గా ఉన్న ఈ ఫోటో ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అవుతోంది.