టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ గురించి ఇక్కడ పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగులో వున్న మంచి నటులలో రవితేజ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తరువాత మరలా అంత కస్టపడి సినిమా పరిశ్రమకు వచ్చింది ఆణిముత్యం రవితేజ. ఐతే కొన్ని సంవత్సరాలుగా సినిమా ప్రేక్షకులను రంజింపజేయడంలో రవితేజ కాస్త వెనకబడ్డాడనే విషయం అందరికీ విదితమే. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్‌లో పెడుతున్న రవితేజ మంచి కధలను ఎంచుకోవడంలో తడబడుతున్నాడు. ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, వరుస ప్లాపులు ఇస్తున్న నిర్మాతలు ఆయనను వెతుక్కుంటూ వెళ్లడం.
దాంతో రవి ఇప్పుడు ఒక్కో సినిమాకు 25 కోట్ల వరకు రెమ్యునరేషన్‌ను డిమాండ్ చేస్తోన్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. రవితేజకు ఉన్న క్రేజ్‌తో పాటు మినిమం గ్యారెంటీ హీరో అనే ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఇక అతడు కోరినంత మొత్తాన్ని ప్రొడ్యూసర్స్ కూడా ఇచ్చేస్తున్నారట మరి. ప్రస్తుతం రెండు పాన్ ఇండియన్ సినిమాల్లో నటిస్తున్న రవితేజ ఈసారి ఏకంగా ఇండియన్ సినిమా మార్కెట్ పైన దృష్టిని పెట్టాడు.
అందులో ఒకటి టైగర్ నాగేశ్వరరావు. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక్కడ చెప్పుకోదగ్గ కొత్త విషయం ఏమంటే, చాలా సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ఇక రెండో పాన్ ఇండియా సినిమా కెమెరామెన్ కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు తాజాగా ‘ఈగల్’ అని నామకరణం చేసారు. ఈ రెండు సినిమాలతో పాటు హరీష్ శంకర్, త్రినాథరావు నక్కిన, గోపీచంద్ మలినేనిలతో రవితేజ సినిమాలు చేయబోతున్నట్లు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.