తమన్నా తన 80% రెమ్యూనరేషన్ అలానే చేస్తుందా..? తెల్లపిల్లకి తెలివి ఎక్కువే..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా ప్రెసెంట్ ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . హ్యాపీ డేస్ సినిమా ద్వారా ఫస్ట్ హిట్ని తన ఖాతాలో వేసుకున్న తమన్నా ప్రెసెంట్ ఒక్కో సినిమాకి మూడు కోట్లు నుంచి నాలుగు కోట్లు చార్జ్ చేస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్గా ముందుకెళ్తుంది . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో వరుస సినిమాలకు కమిట్ అవుతూ సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో ఏలేస్తున్న తమన్నా.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . దానికి కారణం కూడా లేకపోనూలేదు .

ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ వర్మతో ఎక్కువగా తిరుగుతున్న తమన్నా.. అతగాడితో ఏకంగా లిప్ లాక్ చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఈ క్రమంలోనే ఈ జంట త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని అందుకే హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు అంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇలాంటి క్రమంలోనే తమన్న తన రెమ్యూనరేషన్ ఏ విధంగా సేవ్ చేస్తుందో అన్నదానిపై బాలీవుడ్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి . అయితే ఒక్కో సినిమాకి మూడు నుంచి నాలుగు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకునే తమన్నాకి సైడ్ బిజినెస్ లు కూడా చాలా ఉన్నాయట.

ఫుడ్ బిజినెస్ లు .. షేర్స్ లో చాలా ఇన్వెస్ట్ చేసిందట . అంతేకాదు రెండు వజ్రాల మూటలు కూడా తమన్నా వద్ద ఉన్నాయి అంటూ ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది . అంతే కాకుండా స్వతహాగానే బిజినెస్ మైండ్ గల తమన్నా డిఫరెంట్ బిజినెస్ లో పెట్టుబడులు పెట్టిందట . ఈ క్రమంలోనే తమన్నా తనకొచ్చే రెమ్యూనరేషన్ లో 80% మొత్తం బిజినెస్ సేవింగ్స్ పరంగానే ముందుకెళుతుందని .. 20% మాత్రమే తన మేకప్ ఖర్చులకు వినియోగించుకుంటుందని ..ఎక్కడికైనా పార్టీలో ట్రీట్ లు అన్న కూడా తమన్న ఒక్క రూపాయి కూడా తియ్యనే తియ్యదట. ఈ క్రమంలోనే కొందరు ఈ తెల్లపిల్లకి ఎక్కువ తెలివితేటలే.. ముందు జాగ్రత్త ఎక్కువే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో బాలీవుడ్ మీడియాలో మరోసారి తమన్న పేరు వైరల్ గా మారింది..!!