టీడీపీ-జనసేన పొత్తులో ట్విస్ట్‌లు..సీట్ల కోసం పోరు.!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు దిశగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి వైసీపీకి లాభం జరిగింది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్తితి రాకూడదని చెప్పి.రెండు పార్టీలు పొత్తు దిశగా ముందుకెళుతున్నాయి. దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని చెప్పవచ్చు. అందులో ఎలాంటి డౌట్ లేదు. అయితే వీరితో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత తేలనుంది.

ఇక పొత్తులో సీట్ల పంపకాలు ఎలా ఉంటాయనేది క్లారిటీ లేదు.జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించాలని టి‌డి‌పి అనుకుంటుంది. అసలు జనసేన ఎన్ని సీట్లు డిమాండ్ చేయాలని అనుకుంటుందో తెలియడం లేదు. వీటిపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి గాని..అధికారికంగా మాత్రం ఎలాంటి వార్తలు రాలేదు. కానీ ఆయా నియోజకవర్గాల్లో సీట్ల విషయంలో రచ్చ నడుస్తుంది. సీట్లు తమకంటే తమకని రెండు పార్టీల నేతలు చెప్పుకుంటున్నారు. ఉదాహరణకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ, విజయవాడ వెస్ట్, కైకలూరు, పెడన సీట్లపై రెండు పార్టీల మధ్య పంచాయితీ ఉంది. కానీ ఎవరికి ఏ సీటు దక్కుతుందో ఇంకా తేలలేదు.

ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ రచ్చ ఎక్కువగానే ఉంది. నరసాపురం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు, నిడదవోలు లాంటి సీట్లపై జనసేన ఫోకస్ పెట్టింది..కానీ అన్నీ సీట్లని టి‌డి‌పి ఇవ్వడానికి రెడీగా లేదు. ఇక ఉమ్మడి తూర్పు గోదావరిలో సీట్ల కోసం పెద్ద రచ్చ నడుస్తుంది. ప్రతి సీటులోనూ రెండు పార్టీల మధ్య పోటీ ఉంది. కాబట్టి పొత్తు త్వరగా తేల్చుకుని సీట్ల పంపకాలు తేల్చుకుంటేనే కాస్త ఇబ్బందులు తప్పుతాయి. లేకపోతే ఏదొక ఇబ్బంది తప్పదు.