రెడ్లతో చిక్కులు..డిప్యూటీ సీఎంకు రిస్క్.!

అధికార వైసీపీలో రెడ్డి సామాజికవర్గం హవా ఉందా? అంటే..అందులో ఏమైనా డౌట్ ఉందా? అనే అడగవచ్చు. ఎందుకంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక రెడ్లకే పూర్తి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వచ్చారు. పెద్ద పెద్ద పదవులు వారికే దక్కాయి..అలాగే సలహాదారుల పదవులు వారికే ఉన్నాయి. చాలా కీలక పదవులు వారికే వచ్చాయి. వైసీపీ అంటే రెడ్ల పార్టీ అనే పరిస్తితి కనిపించింది. అయితే రెడ్ల హవా వైసీపీలో ఎక్కువగానే ఉంది.

అదే సమయంలో ఎస్సీ రిజర్వడ్ స్థానాల్లో కూడా రెడ్ల ఆధిక్యం ఎక్కువ ఉందని సొంత పార్టీ నేతలే మాట్లాడే పరిస్తితి. ఆ మధ్య సాలూరులో డిప్యూటీ సీఎం రాజన్న దొర..తన నియోజకవర్గంలో రెడ్లతో పాటు అగ్రవర్గాల పెత్తనం ఉండకుండా చేయాలని జగన్‌ని కోరారు. ఇక ఇటు గంగాధర నెల్లూరులో డిప్యూటీ సి‌ఎం నారాయణస్వామి రెడ్డి వర్గం నేతలతో బాగానే ఇబ్బంది పడుతున్నారు. తన నియోజకవర్గంలో రెడ్డి వర్గం నేతల హవా ఎక్కువైంది. తనకి వ్యతిరేకంగా వారు రాజకీయం చేస్తున్నారని ఆవేదన వ్యక్యం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి ఆయన రెడ్డి వర్గంపై కామెంట్లు చేస్తున్నారు.

తాజాగా కూడా రెడ్డి వర్గంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీలో రెడ్లే ఎక్కువగా ఉన్నారని, తనను ఏ సమావేశానికి పిలిచినా అక్కడ ఎక్కువగా అగ్రవర్ణాల వారే ఉంటారని, తాను ఎప్పుడు ఏమి మాట్లాడినా తమ పార్టీలోని వారే చులకనగా చూస్తారని ఆవేదన చెందారు. అదే సమయంలో తన నియోజకవర్గంలో కొండలు, గుట్టలపై జగనన్న ఇళ్లకు స్థలాలు కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. మొత్తానికి తమ పార్టీలో రెడ్లు ఎక్కువ ఉన్నారని , వారి పెత్తనం ఎక్కువ ఉందని ఇతర వర్గాల వారు ఆవేదన చెందుతున్నారు. ఈ అంశం పెద్దది కాకముందే అధిష్టానం సర్ది చెబితే పర్లేదు..లేదంటే మున్ముందు ఇబ్బందులే.