సోషల్ మీడియా సంపాదనలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరోయిన్స్..!!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ సైతం ఎక్కువగా సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకుంటూ వాటితో భారీగానే సంపాదిస్తున్నారు. కొంతమంది హీరోయిన్స్ మిలియన్ల కొద్ది ఫాలోవర్స్ ను మెయింటైన్ చేస్తూ వ్యక్తిగత బ్రాండ్ల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటూ భారీగానే సంపాదిస్తున్నారు.. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ తెలిపిన ప్రకారం ఎవరు ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా సంపాదిస్తున్నారు ఒకసారి తెలుసుకుందాం.

Priyanka Chopra and Katrina Kaif shower birthday love on Deepika Padukone |  Bollywood - Hindustan Times

1). ప్రియాంక చోప్రా: ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి రూ .2 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

2). దీపికా పదుకొనే:
ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి కోట నుంచి రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేస్తుందట.

3). కత్రినా కైఫ్:
ఇంస్టాగ్రామ్ లో ఒక్కో పోస్ట్ కి దాదాపుగా కోటి రూపాయలపైగా అందుకుంటున్నట్లు తెలుస్తోంది.

4). ఆలియా భట్:
ఈ ముద్దుగుమ్మ instagram లో ఏదైనా పోస్ట్ చేయాలంటే రూ.1.5 నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

5). శ్రద్ధా కపూర్:
ఈ ముద్దుగుమ్మ ఇంస్టాగ్రామ్ లో ఏదైనా పోస్ట్ చేయాలంటే కోటిన్నర డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.

లింకుతో కూడిన పోస్టులు చాలా ఖరీదు అయినవి.. అంతేకాకుండా సోషల్ మీడియాలో యాడ్స్ పోస్టులు ఖర్చుపరంగా పరిశీలిస్తే ఇతర వాటిలో కంటే చౌకంగానే అందుబాటులో ఉంటాయని మీడియా సంస్థ తెలియజేస్తోంది. సెలబ్రిటీలతో కూడిన పేజీ బ్రాండ్తో కలిసి పనిచేయాలంటే చాలా ఖర్చు అవుతుందట. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరూ ఉపయోగిస్తూ ఉండడం వల్ల ఇలా సెలబ్రిటీలను ఉపయోగించి పలు ప్రమోషన్స్ ను సైతం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.