యంగ్ హీరో సంతోష్ శోభన్ వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ, సరైన హిట్ మాత్రం పడటం లేదు. తాజాగా `అన్నీ మంచి శకునములే` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటించింది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకార్ జానకి, ఊర్వశి, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.
పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 18న విడుదలైంది. టీజర్, ట్రైలర్ తో అంచనాలు బాగానే పెంచినా.. ఆ అంచనాలను సినిమా అందుకోలేకపోయింది. ఒక కాఫీ ఎస్టేట్.. దానిపై హక్కుల కోసం రెండు కుటుంబాల మధ్యన పోరాటం. ఈ రెండు కుటుంబాల్లోనూ ఒకే టైమ్ లో పుట్టిన ఇద్దరు పిల్లలు తారుమారవుతారు. వాళ్లిద్దరూ పెద్దయ్యి హీరో హీరోయిన్లవుతారు. హీరో జులాయి అయితే.. హీరోయిన్ కాలిక్యులేటెడ్, బిజినెస్ మైండెడ్. వీళ్లిద్దరి మధ్య ఆకర్షణ, వికర్షణ, సంఘర్షణ.. ఫైనల్ గా హ్యాపీ ఎండింగ్.. ఇదే కథ.
ఫ్యామిలీ ఎంటర్‌టైనరే అయినా చాలా బోరింగ్‌గా ఉందని సగటు ప్రేక్షకుడు కూడా ఈ సినిమా పెదవి విరిచాడు. సోలోగా వచ్చినా సంతోష్ శోభన్ కు శకునం కలిసి రాలేదు. డివైడ్ టాక్ రావడం తో మొదటి ఆట నుండే ఆక్యుపెన్సీలు లేకుండా పోయాయి. దాంతో తొలి రోజు రూ. 50 లక్షల షేర్ తో ఈ మూవీ సరిపెట్టుకుందని తెలుస్తోంది. మొత్తానికి సమ్మర్ లో ఈ చిత్రం మరో డిజాస్టర్ గా నిలిచిందని అంటున్నారు. కొందరైతే ఇది పర్ఫెక్ట్ ఓటీటీ మూవీ అని అభిప్రాయపడుతున్నారు.