విచిత్రమైన లుక్ తో సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రష్మి గౌతమ్..!

సినీ నటులు తరచూ ఫొటో షూట్స్ చేస్తుంటారు. తమ జీవితానికి సంబంధించిన ఎన్నో ఫొటోలను నిత్యం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. మేకప్‌లో ఉండగా, మేకప్ లేకుండా ఉన్న ఫొటోలు చూసినప్పుడు అభిమానులు ఆశ్చర్యపోతుంటారు. తమ అభిమాన నటీనటులు ఇలా ఉంటారా అని ముక్కున వేలేసుకుంటారు. సినీ నటిగా, బుల్లితెర యాంకర్ గా ఎంతో పేరు సంపాదించిన రష్మీ గౌతమ్ అంటే తెలియని వారుండరు. అడపాదడపా సినిమాలు చేస్తూనే ప్రస్తుతం యాంకర్ లలో టాప్ స్థానంలో ఆమె ఉంది. యాంకర్ గా నవ్వుతూ, నవ్విస్తూ కార్యక్రమాలకు మరింత వన్నె తెస్తుంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఆమె స్టిల్, మేకప్ లేకుండా దిగిన ఫొటో అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో నటుడిగా సుడిగాలి సుధీర్, యాంకర్ గా రష్మికి మంచి పేరు వచ్చింది. వీరిద్దరి మధ్య బాండింగ్ అంటే కూడా ప్రేక్షకులకు చాలా ఇష్టం. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. ఏదేమైనా తమకు కెరీర్ ముఖ్యమని ఇద్దరూ ముందుకు సాగుతున్నారు. ఇక తరచూ సినిమాలు కూడా చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ముఖ్యంగా రష్మి యాంకరింగ్ కు తెలుగులో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఉన్నారు.

ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లో ఉంటుంటారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల పోస్ట్ చేసిన ఫొటో చూసి అంతా అవాక్కయ్యారు. ఏదో తెలియని బాధలో ఉన్నట్లు ఆమె ముఖం చూస్తే అర్ధం అవుతుంది. ఏ మాత్రం మేకప్ లేకుండా, పరధ్యానంలో ఉన్నట్లు ఆమె కనిపిస్తోంది. అది చూసిన అభిమానులు ఆమెకు ఏమైందోనని చర్చించుకుంటున్నారు. అయితే మేకప్ లేకుండా నటీనటులు ఇలాగే ఉంటారని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Share post:

Latest