టాలీవుడ్ లో హైయెస్ట్ స‌క్సెస్ రేటు ఉన్న హీరో ఎవ‌రో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ లో నేటితరం హీరోల్లో హైయెస్ట్ సక్సెస్ రేటు ఉన్న హీరో ఎవరు అని అడిగితే.. ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా టాప్ హీరోల పైన అందరి చూపులు పడతాయి, కానీ వారు ఎవ్వ‌రూ కాదు. అత్యధిక సక్సెస్ రేటు ఉన్న హీరోగా న్యాచుర‌ల్‌ స్టార్ నాని నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఊహించ‌లేదు క‌దూ.. టైర్-2 హీరోల జాబితాలో ఉన్న నాని ఈ ఘనతను సొంతం చేసుకోవడం నిజంగా విశేషమే.

నానికి సక్సెస్ రేట్ దాదాపు 85 శాతం ఉంది. దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి సినీ ప‌రిశ్ర‌మ‌లో హీరోగా కొన‌సాగుతున్న నాని.. అష్టా చమ్మా ద‌గ్గ‌ర నుంచి రీసెంట్ గా విడుద‌లైన ద‌స‌రా వ‌ర‌కు మొత్తం 29 చిత్రాల్లో న‌టించాడు. వాటిల్లో ఏకంగా 18 సినిమాలు హిట్, సూప‌ర్ హిట్స్‌గా నిలిచాయి. అలాగే ఐదు చిత్రాలు ఫ్లాప్ అవ్వ‌గా.. నాలుగు చిత్రాలు యావ‌రేజ్ గా నిలిచాయి. ఇక రెండు సినిమాలు నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యాయి.

నాని సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది. కొత్త టాలెంట్ ను ప్రోత్స‌హిస్తాడు. పైగా నిర్మాత‌ల హీరో అన్న పేరు కూడా ఉంది. అందుకే ప్రొడ్యూస‌ర్స్‌ కూడా నాని సినిమాల‌పై పెట్టుబడులు పెట్టేందుకు ఏ మాత్రం వెన‌కాడ‌రు. ఇక నాని తర్వాత హైయ్యెస్ట్ స‌క్సెస్ రేటు ఉన్న హీరోల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్‌ ఉన్నారు.

Share post:

Latest