స‌మంత‌లో నాగ‌చైత‌న్య‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే ఏకైక క్వాలిటీ ఏంటో తెలుసా?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య త్వరలో `కస్టడీ` అనే మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టిస్తే.. అర‌వింద్‌ స్వామి విలన్ గా చేశాడు. మే 12న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాల‌ను నిర్వహిస్తున్నారు.

నాగచైతన్య కూడా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ త‌న‌ సినిమాపై మంచి హైప్‌ పెంచుతున్నాడు. అలాగే ఇంటర్వ్యూల్లో ముక్కు సూటిగా వ్యవహరిస్తున్నాడు. తనకు ఎదురైన ప్రశ్నలకు చాలా బోల్ట్‌గా సమాధానాలు ఇస్తున్నాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో యాంక‌ర్ కొంద‌రు హీరోయిన్ల పేరు వారిలో న‌చ్చిన క్వాలిటీ చెప్ప‌మ‌ని చైతూను కోరింది. ఈ క్ర‌మంలోనే పూజా హెగ్డేలో ఆమె స్మైల్ త‌న‌కు ఇష్ట‌మ‌ని, కృతి శెట్టిలో ఇన్నోసెన్స్ త‌న‌కు న‌చ్చుతుంద‌ని చెప్పాడు.

ఇక యాంక‌ర్ స‌మంత పేరు చెప్ప‌గానే.. చైతు ఆమె హార్డ్ వ‌ర్క్ అని స‌మాధానం ఇచ్చాడు. సామ్ లో త‌న‌కు పిచ్చ పిచ్చ‌గా న‌చ్చే ఏకైక క్వాలిటీ అదే అన్నాడు. చైతూనే కాదు చాలా మంది స‌మంత హార్డ్ వ‌ర్క్ ను ఇష్ట‌ప‌డ‌తారు. ఆమె క‌మిట్ అయిన సినిమాల‌కు ఎంత‌లా క‌ష్ట‌ప‌డుతుందో ఇప్ప‌టికే ఎన్నో సార్లు స్ప‌ష్ట‌మైంది. ఇక‌పోతే నాగ‌చైత‌న్య‌, స‌మంత డివోర్స్డ్ అన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి 2017లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. కానీ, వివాహం త‌ర్వాత క‌నీసం నాలుగేళ్లు కూడా క‌లిసి ఉండ‌లేక‌.. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు.

Share post:

Latest