NTR30: ఏకంగా 10 మంది హీరోయిన్స్.. ఐటెమ్ సాంగ్ ని ఢిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్న కొరటాల..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే సినీ లవర్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీలలో ఎన్టీఆర్ థర్టీ సినిమా కూడా ఒకటి . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా ఎన్టీఆర్ 30 . కొరటాల శివ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. సినిమా ప్రకటన ఎప్పుడో వచ్చిన రీసెంట్ గానే షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమాకి సంబంధించిన క్రేజీ క్రేజీ పిక్స్ సోషల్ మీడియాలో అభిమానులకి కొత్త రకమైన ఫీలింగ్ కలుగుతుంది.

ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . ఇప్పటికే ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ జాన్వికపూర్ మొదటి హీరోయిన్గా సెలెక్ట్ అయింది . రెండో హీరోయిన్ గా మృణాల్ ఠాకూర్ – రష్మిక వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు కన్ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నాడట కొరటాల . కాగా ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం ఏకంగా పదిమంది హీరోయిన్స్ తో స్టెప్పులు వేయనున్నాడు తారక్ అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

ఇదే న్యూస్ ప్రెసెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే తారక్ లాంటి హీరో పక్కన పదిమంది హీరోయిన్స్ డాన్స్ చేస్తుంటే చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . చూద్దాం మరి తారక్ ఏ విధంగా డ్యాన్స్ చేసి..ఈ సినిమాతో హిట్ అందుకుంటాడో..?