అమ్మ బాబోయ్..రవి కృష్ణ ఆ విషయంలో అంత తోపా..? నవ్యస్వామితో అలా కూడా చేసాడా..?

బుల్లితెరపై యాక్టర్ రవి కృష్ణకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మొగలిరేకులు సీరియల్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రవికృష్ణ ఓవైపు బుల్లితెరపై సీరియల్స్ లో మెరుస్తూనే మరోవైపు సినిమా ఇండస్ట్రీలోను అవకాశాల కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు . ఈ క్రమంలోనే ఆరాకొరా అవకాశాలతో సరిపెట్టుకుంటూ వచ్చిన రవికృష్ణ రీసెంట్గా మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ హీరోగా నటించిన విరుపాక్ష సినిమాలో కీలకపాత్రలో నటించి మెప్పించాడు. రవికృష్ణ అంటే అందరూ చాలా సైలెంట్ బాయ్ అనుకునే వాళ్ళకి ఈ సినిమా చూడగానే గుండెలు ఝల్లుమనేలా చేశాడు .

ఈ సినిమాలో ఓ మాంత్రికుడు కొడుకుగా రవికృష్ణ కనిపించి అభిమానులను మెప్పించాడు. కాగా ఈ క్రమంలోనే విరుపాక్ష సినిమా హిట్ అయిన సందర్భంలో యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రవికృష్ణ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టాడు . అంతేకాదు హోస్ట్ తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడిగి సరదా సరదాగా ఇంటర్వ్యూ ని ముందుకు తీసుకెళ్లాడు . ఈ క్రమంలోనే సీరియల్ యాక్టర్ తన కో ఆర్టిస్ట్ నవ్య స్వామితో ఆయను కున్న రిలేషన్షిప్ గురించి ప్రశ్నించాడు .

“అందరూ మీ మధ్య ప్రేమ ఉంది అని ..మీరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని ..అంటున్నారు.. నిజమేనా..?” అంటూ ప్రశ్నించారు . ఈ క్రమంలోనే రవికృష్ణ ..”అలాంటిది ఏమీ లేదు.. నేను నవ్య స్వామి చాలా మంచి ఫ్రెండ్స్. మేము ఇద్దరం కలిసి చేసింది ఒకటంటే ఒక్కటే సీరియల్ .. తెర పై కెమిస్ట్రీ బాగా పండింది .. అందుకే పలు షోస్ కూడా మమ్మల్ని జంటగా పిలుస్తున్నాయి . అంతే తప్పిస్తే మా మధ్య ఏమీ లేదు . ఇప్పటివరకు మేము మంచి ఫ్రెండ్సే నవ్య స్వామి నా గురించి ఆలోచించి పెళ్లి ప్రపోజల్ తెస్తే అప్పుడు ఆలోచిస్తాను ” అంటూ చెప్పుకొచ్చాడు.

ఈ క్రమంలోనే రవికృష్ణ మనసులో నవ్య స్వామి అంటే ఇష్టం లేకపోతే ఆ కామెంట్ ఎందుకు చేస్తాడు..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. రవికృష్ణ కి ఇష్టమైన నవ్య స్వామి ప్రపోజల్ తీసుకొస్తే ఓపెన్ అప్ అవుదామని వెయిట్ చేస్తున్నాడు అని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా రవి కృష్ణ – నవ్య స్వామి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు . చూడముచ్చటగా ఉండే ఈ జంట రియల్ భార్యాభర్తలుగా అయితే చూడాలన్నది అభిమానుల కోరిక . చూద్దాం నవ్య స్వామి-రవి ఎప్పుడు ఆ కోరిక తీరుస్తారో..?

Share post:

Latest