ఎన్టీఆర్ పరువు తీస్తుంది ఎవరు.. అభిమానుల్లో ఇంత గంద‌ర‌గోళ‌మా ?

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఇప్పుడు రీరిలీజ్ సినిమాల ట్రెండ్ నడుస్తుంది. మహేష్- పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ ఆ తర్వాత వచ్చిన సినిమాలకు బాగానే కలిసి వచ్చింది. అయితే ఇప్పుడు క్రమంగా అభిమానుల దగ్గర నుంచి ఆదరణను కోల్పోతుంది. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన కొన్ని సినిమాలకైతే వాటి అద్దె ఖర్చులు కూడా రావటం లేదు. గతంలో వచ్చిన పోకిరి, జల్సా, చెన్నకేశవరెడ్డి, ఖుషి వంటి సినిమాలు కమర్షియల్‌గా మంచి సక్సెస్ సాధించాయి.

అయితే ఇప్పుడు స్టార్ హీరోల అభిమానులని ఎమోషనల్ గా టార్గెట్ చేసి కలెక్షన్లను రాబట్టుకోవాలని చూస్తున్న డిస్ట్రిబ్యూటర్ల అత్యాశ ఇప్పుడు అది వారికే రివర్స్ అవుతుంది. దీనికి ముఖ్య ఉదాహరణ నిన్న విడుదలైన ఎన్టీఆర్- ఆంధ్రావాలా సినిమానే.. ఈ సినిమాను నిన్న కొన్నిచోట్ల విడుదల చేశారు. ఈ మూవీ అప్పట్లోనే ఎన్టీఆర్ కెరీర్‌లోనే భారీ డిజాస్టర్‌గా మిగిలింది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులు సైతం డిస్ట్రిబ్యూటర్లకు ఫోన్ చేసి ఈ సినిమాను రిలీజ్ చేయొద్దని మరీ వేడుకున్నారు.

Andhrawala (2004) - IMDb

ఎన్టీఆర్ కెరీర్‌లో సూపర్ హిట్ సినిమాలు ఆది, స్టూడెంట్ నెంబర్ వన్ వంటి సినిమాలు అయితే తాము ఎంజాయ్ చేస్తామని.. ఇలా డిజాస్టర్ అయినా సినిమాలను మళ్లీ విడుదల చేస్తే యాంటీ అభిమానులకు టార్గెట్ అవుతామని వారు వాపోయారు. అయితే ఎన్టీఆర్ అభిమానుల మాటల‌ను డిస్ట్రిబ్యూటర్లు వినలేదు.. తీరా సినిమా రిలీజ్ అయ్యాక చూస్తే కనీసం రెండు మూడు వేల కలెక్షన్లు కూడా రాలేదట.

ఇది నిజంగానే ఎన్టీఆర్ అభిమానుల పరువు తీసే పనే.. ఇప్పుడు ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ పరువు మరింత పాతాళానికి నెట్టేస్తున్నారు.. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సింహాద్రి సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఊపు వచ్చింది. మే 20న ఆది సినిమా కూడా అభిమానుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులో ఇప్పుడు పెద్ద గందరగోళం మొదలైంది.

Aadi Movie To Re Release in November: Crucial Time for Junior NTR Fans: | నవంబర్లో 'ఆది' రీ రిలీజ్.. ఎన్టీఆర్ ఫాన్స్ కు విషమ పరీక్షే.. ఎందుకంటే?] News in Telugu

ఇక తమ హీరో నటించిన రెండు సూపర్ హిట్ సినిమాలు ఒకేసారి వ‌స్తే ఇబ్బందులు వస్తాయని.. అదేవిధంగా ఈ రెండు సినిమాలలో ఏ సినిమాకు కూడా సరైన కలెక్షన్లు రావని దీంతో యాంటీ అభిమానులకు టార్గెట్ అవ్వడంతో పాటు ఈ రెండు సినిమాలకు సరైన కలెక్షన్లు రావంటూ వాపోతున్నారు.

Image gallery for Simhadri - FilmAffinity

ఈ రెండు సినిమాలో ఒక సినిమాను మాత్రం రిలీజ్ చేస్తే బాగుంటుందని.. ఇలా ఒకేసారి ఒకేరోజు రెండు సినిమాలు రిలీజ్ చేస్తే అభిమానులు కన్ఫ్యూజ్ అవుతారు. అదేవిధంగా రికార్డులు కూడా మిస్ అవుతాయి. ప్రధానంగా మనందరం ఎన్టీఆర్ పరువు తీసిన వాళ్ళం అవుతామని అభిమానులు వాపోతున్నారు. ఈ అభిమానుల గోడు ఎవరు పట్టించుకుంటారో చూడాలి.